హైదరాబాద్ లో ఇద్దరు ట్రాన్స్ జెండర్లు దారుణ హత్యకు గురయ్యారు. కత్తులు, బండరాళ్లతో మోది హత్య చేశారు దుండగులు.

హైదరాబాద్ : హైదరాబాద్ లోని టప్పాచబుత్ర, దైబాంగ్ లో ఇద్దరు హిజ్రాలు దారుణ హత్యకు గురయ్యారు. కత్తి, బండరాళ్లతో మోది ఇద్దరు ట్రాన్స్ జండర్లను హత్య చేశారు దుండగులు. సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దీనిమీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజీ విడుదల చేశారు పోలీసులు. ఇందులో కిందపడుకున్న వారిని ఓ వ్యక్తి బండరాయితో మోదీ చంపడం కనిపిస్తుంది. పాత గొడవలే హత్యకు కారణమని భావిస్తున్నారు.దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.