ట్రాన్స్ జెండర్ మారి జీవనం సాగిస్తున్న దివ్య రైల్లో వెళుతూ ప్రమాదానికి గురయి ప్రాణాలు కోల్పోయింది.  

జనగామ : ప్రమాదవశాత్తు రైల్లోంచి కిందపడి ట్రాన్స్ జెండర్ మృతిచెందిన విషాద ఘటన జనగాం జిల్లాలో చోటుచేసుకుంది. సికింద్రాబాద్ లో శాతవాహన ఎక్స్ ప్రెస్ ఎక్కిన ట్రాన్స్ జెండర్ జనగామ జిల్లాలో కదులుతున్న రైలుదిగే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే రైలు కింద పడిపోయిన ఆమె మృతిచెందింది. 

వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలానికి చెందిన 25ఏళ్ల యువకుడు బాదావత్ అనిల్ ట్రాన్స్ జెండర్. దివ్యగా పేరు మార్చుకున్న అతడు పూర్తిగా ఆడవారిలా మారిపోయాడు. అయితే తాజాగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో శాతవాహన ఎక్స్ ప్రెస్ ఎక్కిన దివ్య స్వస్థలానికి వెళుతూ ప్రమాదానికి గురయ్యింది. రఘునాథపల్లి రైల్వే స్టేషన్ కు చేరుకోగానే మెల్లిగా కదులుతున్న రైల్లోంచి ఆత్రంగా కిందకు దిగేందుకు ప్రయత్నించింది దివ్య. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు కాలుజారి రైలుకింద పడిపోయింది. 

ప్లాట్ ఫారంపై వున్నవారు దివ్యను కాపాడేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. రైల్వే పట్టాలపై పడిపోయిన ఆమె పైనుండి రైలు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. దివ్యను గుర్తించినవారు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.

Read More హైదరాబాద్ ఫిలింనగర్ లో బెంజ్ కారు బీభత్సం..

రైల్వే పట్టాలపై పడిపోయిన దివ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు పోలీసులు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించగా స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.