తెలంగాణలోని ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మేడారం జాతర వెళ్లే మార్గంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. గట్టమ్మ ఆలయం సమీపంలో ఆర్టీసీ బస్సు, కారు ఢీ కొన్నాయి.
తెలంగాణలోని ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మేడారం జాతర వెళ్లే మార్గంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. గట్టమ్మ ఆలయం సమీపంలో ఆర్టీసీ బస్సు, కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీశారు.
ఈ ప్రమాదంలో దెబ్బతిన్న కారున రోడ్డుపై నుంచి పక్కకు తొలగించారు. రోడ్డు ప్రమాదంలో గట్టమ్మ ఆలయ సమీపంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.దీంతో పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసే పనిలో నిమగ్నమయ్యారు.ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు.
మృతులను ములుగు జిల్లా వాజేడు మండలానికి చెందిన రమేష్, జ్యోతి, శ్రీనివాస్ సుజాతగా గుర్తించారు. వీరు పెళ్లి సంబంధం మాట్లాడటానికి కారులో బయలుదేరారు. అయితే గట్టమ్మ ఆలయం సమీపంలో వీరు ప్రయాణిస్తున్న కారును హన్మకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో జ్యోతి, రమేష్, శ్రీనివాస్, కారు డ్రైవర్ కల్యాణ్ ఘటన స్థలంలోనే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన సుజాతను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.
