దేశవ్యాప్తంగా రేపు గణతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో.... రేపు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. హైదరాబాద్ లోని నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో... పబ్లిక్‌ గార్డెన్స్‌ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. 

ఈ ఆంక్షలు 26 ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అమల్లో ఉంటాయని సీపీ అంజనీ కుమార్‌ వెల్లడించారు. మొజంజాహి మార్కెట్‌ తాజ్‌ ఐల్యాండ్‌, చాపెల్‌ రోడ్డు టీ జంక్షన్‌, సైఫాబాద్‌ పాత పీఎస్‌, బషీర్‌బాగ్‌ జంక్షన్‌, ఇక్బాల్‌ మీనార్‌, ఏఆర్‌ పెట్రోల్‌ పంప్‌, ఆదర్శ్‌నగర్ ‌(న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌) వద్ద ట్రాఫిక్‌ను మళ్లిస్తారు. ట్రాఫిక్‌ అధికారులు, సిబ్బంది సూచించిన మార్గాల్లో ప్రయాణించి ట్రాఫిక్‌ సాఫీగా సాగేలా ప్రజలు సహకరించాలని సీపీ కోరారు.