రసూల్‌పురా నాలా మరమ్మత్తుల కారణంగా రేపటి నుంచి జూన్ 4 వరకు సికింద్రాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
సికింద్రాబాద్ (secunderabad) సీటీవో జంక్షన్ (cto junction) నుంచి రసూల్‌పురా (rasulpura) వరకు ట్రాఫిక్ ఆంక్షలు (traffic restrictions) విధించారు పోలీసులు. రేపటి నుంచి జూన్ 4వ తేదీ వరకు ఆంక్షలు కొనసాగుతాయని పోలీసులు వెల్లడించారు. రసూల్‌పురా నాలా మరమ్మత్తుల కారణంగా ఆంక్షలు విధించినట్లు అధికారులు తెలిపారు. సీటీవో నుంచి వచ్చే వాహనాలను హనుమాన్ దేవాలయం మీదుగా మళ్లించనున్నారు. బేగంపేట నుంచి వచ్చే వాహనాలను రసూల్‌పురా నుంచి కిమ్స్ వైపుగా మళ్లించనున్నారు. ట్రాఫిక్ ఆంక్షల కారణంగా వాహనదారులు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.
