తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఈ రోజు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష కొనసాగింది. 

తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఈ రోజు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష కొనసాగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న నిర్వహిస్తున్న తొలి గ్రూప్ 1 పరీక్ష ఇదే. ఇందుకోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) భారీగా ఏర్పాట్లు చేశారు. ఉదయం 8.30 గంటల నుంచే అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. ఉదయం 10:15 గంటలు దాటిన తర్వాత పరీక్ష కేంద్రంలోకి అభ్యర్ధులను అమనుతించలేదు.

అయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ఎగ్జామ్ సెంటర్‌ విషయంలో పోరపడిన ఓ యువతి.. ట్రాఫిక్ పోలీసులు సకాలంలో ఆమె పరీక్ష రాయాల్సిన పరీక్ష కేంద్రం వద్దకు చేర్చారు. వివరాలు.. గ్రూప్ 1 ఎగ్జామ్ కోసం వచ్చిన ఓ యువతి పొరపాటున వేరే సెంటర్‌కు వెళ్లారు. అయితే అక్కడికి చేరుకున్న తర్వాత తాను పొరబడినట్టుగా తెలుసుకున్న యువతి.. తన సెంటర్ కి ఎలా వెళ్ళాలో అర్థం కాలేదు. అయితే ఎగ్జామ్ సెంటర్‌కు ఇబ్బంది పడుతున్న యువతిని ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ పోలీసు ఒకరు.. తన వాహనంపై సకాలంలో ఎగ్జామ్ సెంటర్‌కు చేర్చారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి వార్త సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది. దీంతో నెటిజన్లు ఆ పోలీసును అభినందిస్తున్నారు. 

Scroll to load tweet…


ఇక, రాష్ట్రంలోని 503 పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహిస్తుంది. ఈ పరీక్ష కోసం 3.80లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. శనివారం అర్థరాత్రి వరకు 3.41 లక్షల మంది హాల్ టికెట్లు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,019 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో 349 కేంద్రాలు ఉన్నాయి.