హైదరాబాదులో 13 కిమీ ట్రాఫిక్ జామ్: గంటల తరబడి రోడ్ల మీదే...

Traffic jam in Hyderabad for 13 kMs
Highlights

హైదరాబాదులోని మాదాపూర్ నుంచి సికింద్రాబాద్ మార్గంలో దాదాపు 13 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయింది. గంటల తరబడి వాహనాలు రోడ్ల మీదే నిలిచిపోయాయి.

హైదరాబాద్: హైదరాబాదులోని మాదాపూర్ నుంచి సికింద్రాబాద్ మార్గంలో దాదాపు 13 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయింది. గంటల తరబడి వాహనాలు రోడ్ల మీదే నిలిచిపోయాయి. ట్రాఫిక్ క్లియర్ కావడానికి ఇంకా సమయం పడుతుందని అంటున్నారు. 

గ్రీన్ ల్యాండ్స్ బ్రిడ్జిపై రెండు వాహనాలు బ్రేక్ డౌన్ కావడంతో వాహనాలు కదలలేని పరిస్థితి ఏర్పడింది. మాదాపూర్, జూబ్లీహిల్స్, చెక్ పోస్టు, పంజగుట్ట, బేగంపేట, ప్యారడైజ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. 

ఆ మార్గంలో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఈ మార్గంలో ప్రయాణించకూడదని పోలీసులు వాహనదారులకు సూచిస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గం చూసుకోవాలని చెబుతున్నారు .

ట్రాఫిక్ జామ్ పై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు సిపి అంజన్ కుమార్ చెప్పారు. కొద్దిసేపట్లో ట్రాఫిక్ క్లియర్ అవుతుందని ఆయన చెప్పారు. గ్రీన్ ల్యాండ్స్ ఫ్లై ఓవరుపై బ్రేక్ డౌన్ అయిన వాహనాన్ని తొలగించినట్లు తెలిపారు. కొన్ని చోట్ల బ్రేక్ డౌన్ అయిన బస్సులను తొలగిస్తున్నట్లు తెలిపారు. అదనపు స్వయంగా ట్రాఫిక్ జామ్ ను సమీక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. 

loader