Asianet News TeluguAsianet News Telugu

సామాన్యుడి దెబ్బ... పోలీస్ వాహనానికి ట్రాఫిక్ జరిమానా

ట్రాఫిక్ ఉల్లంఘటనకు పాల్పడ్డ పోలీస్ వాహనానికి జరిమానా విధించారు.  బుధవారం టీఎస్09పీఏ4083 హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధికి చెందిన పోలీస్ వాహనం ఉప్పల్ రింగురోడ్డు సమీపంలో  తప్పుడు మార్గంలో దూసుకువచ్చింది.

traffic challan to police vehicle in hyderabad
Author
Hyderabad, First Published Jan 10, 2020, 8:25 AM IST

ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే సాధారణ పౌరులకే కాదు... అధికారులకు సైతం జరిమానాలు తప్పవని నిరూపితమైంది. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన ఓ పోలీసు వాహనానికి అధికారులు జరిమానా విధించారు. అయితే... ఆ పోలీసు వాహనం రూల్స్ అతిక్రమిందన్న విషయం ట్రాఫిక్ అధికారుల కన్నా ముందు ఓ సామాన్యుడు గుర్తించడం గమనార్హం. ఈ సంఘటన హైదరాబాద్ లో జరిగింది. 

ట్రాఫిక్ ఉల్లంఘటనకు పాల్పడ్డ పోలీస్ వాహనానికి జరిమానా విధించారు.  బుధవారం టీఎస్09పీఏ4083 హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధికి చెందిన పోలీస్ వాహనం ఉప్పల్ రింగురోడ్డు సమీపంలో  తప్పుడు మార్గంలో దూసుకువచ్చింది.  దానిని ఓ సామాన్యుడు ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు.

ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో... విషయం రాచకొండ కమిషనరేట్ కు  చేరింది. దాంతో తప్పని పరిస్థితిలో పోలీసు వాహనానికి రూ.1135 జరిమానా విధించారు. జరిమానా విధించిన ఫోటో సైతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios