భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మంది మహిళలకు గాయాలు అయ్యాయి. వీరు మహిళ దినోత్సవ వేడుకలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో మహిళా దినోత్సవ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. మహిళ దినోత్సవ వేడుకలకు వెళ్తుండగా ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న 30 మంది మహిళలకు గాయాలు అయ్యాయి. దీంతో వెంటనే వారిని మణుగూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. బాధితులను అశ్వాపురం మండలం మనలోతుల గూడెంకు చెందిన వారిగా గుర్తించారు. మహిళా దినోత్సవంలో పాల్గొనేందుకు వేములూరు నుంచి మణుగూరు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.