శివ లింగాల పేరుతో బీజేపీ రాజకీయం: జగ్గారెడ్డి ఫైర్
శవ రాజకీయాలు చేయడమే బీజేపీ పని అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు. మతాన్ని అడ్డుపెట్టుకొని బీజేపీ రాజకీయాలు చేస్తుందని ఆయన విమర్శలు చేశారు. ఇవాళ హైద్రాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్: శివ లింగాల పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ Jagga Reddy విమర్శించారు.
Telangana కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సోమవారం నాడు హైద్రాబాద్ లో ని గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. గతంలో భాగ్యలక్ష్మి అమ్మవారి పేరుతో ఓట్లు దండుకున్నారన్నారు. పురాతన ఆలయాలకు కేంద్రం ఒక్క రూపాయి ఇచ్చిందా అని ఆయన ప్రశ్నించారు. మతాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని జగ్గారెడ్డి విమర్శలు చేశారు.
Bandi Sanjay ఓ పార్టీ రాష్ట్ర శాఖకు అద్యక్షుడితో పాటు ఎంపీగా కూడా ఉన్న విషయాన్ని జగ్గారెడ్డి ప్రస్తావించారు. ఎంత సేపు శవ రాజకీయాలు చేయడమే బీజేపీ పనా అని ఆయన ప్రశ్నించారు.BJP నేతలు తమ తీరును మార్చుకోకపోతే ఆలయాల చరిత్ర తీసుకొని తానే బీజేపీ కార్యాలయం ముందు కూర్చొంటానని ఆయన చెప్పారు. ఇటీవల Karimnagar లో జరిగిన ఏక్తాయాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
ఇటీవల Karimnagar లో జరిగిన ఏక్తాయాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ నెల 25న కరీంనగర్‌లో జరిగిన హిందూ ఏక్తా యాత్రలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మసీదులు తవ్వి చూద్దామంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి సవాల్ విసిరారు. శవం వస్తే మీది.. శివ లింగం వస్తే మాది అంటూ వ్యాఖ్యానించారు. లవ్ జిహాదీ మత మార్పిడులను చూస్తూ ఊరుకోమని ఆయన చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఉర్దూను నిషేధిస్తామని తేల్చి చెప్పారు. అలాగే తెలంగాణలో మదర్సాలను శాశ్వతంగా తొలగిస్తామని ఆయన స్పష్టం చేశారు. మదర్సాలను ఉగ్రవాద శిక్షణా కేంద్రాలుగా మార్చారని బండి సంజయ్ ఆరోపించారు. కరీంనగర్‌లో తనను మూడు సార్లు చంపాలని చూశారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ ఫైల్స్‌లా తెలుగు రాష్ట్రాల్లో రజాకార్ ఫైల్స్ చూపిస్తామని ఆయన వ్యాఖ్యానించారు.
also read:మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్ పై దాడి: ఇద్దరు కాంగ్రెస్ నేతలు సహా16 మందిపై కేసు
దేశంలోని హిందువుల పట్ల వివిధ రాజకీయ పార్టీల వైఖరిని తమ పార్టీ మార్చిందని అన్నారు. హిందువుల గురించి మాట్లాడమని రాజకీయ పార్టీలను కూడా బీజేపీ బలవంతం చేసిందన్నారు. మైనారిటీలను ప్రసన్నం చేసుకునేందుకు ఈ రాజకీయ పార్టీలు ఎప్పుడూ హిందువులను విభజించడానికి ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. హిందువుల ఐక్యతను చాటిచెప్పేందుకే తాము కరీంనగర్‌లో హిందూ ఏక్తా యాత్రను నిర్వహిస్తున్నామన్నారు