మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్ పై దాడి: ఇద్దరు కాంగ్రెస్ నేతలు సహా16 మందిపై కేసు


తెలంగాణ మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్ పై దాడి ఘటనలో ఘట్‌కేసర్ పోలీసులు మంగళవారం నాడు కేసు నమోదు చేశారు. 16 మందిపై ఆరు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఎఫ్ఐఆర్ లో  ఇద్దరు కాంగ్రెస్ నేతల పేర్లను కూడా చేర్చారు.

Minister Malla Reddy Convoy Attacked:Ghatkesar Police Files Case Against 16 including Two Congress leaders


హైదరాబాద్: తెలంగాణ మంత్రి Malla Reddy కాన్వాయ్ పై Ghatkesar లో దాడి చేసిన ఘటనపై పోలీసులు సోమవారం నాడు కేసు నమోదు చేశారు. ఆరు సెక్షన్ల కింద Police కేసు పెట్టారు. మొత్తం 16 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోమశేఖర్ రెడ్డి, హరివర్షన్ రెడ్డి పేర్లను  FIR లో చేర్చారు.173, 147, 149, 341, 352, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 

also read:మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్‌పై దాడి: ఘట్‌కేసర్ పోలీసులకు టీఆర్ఎస్ ఫిర్యాదు

ఈ నెల 29న ఘట్ కేసర్ లో జరిగిన రెడ్ల సింహాగర్జన కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. మంత్రి మల్లారెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో కొందరు ఆయన ప్రసంగానికి అడ్డు తగిలారు. ఆ తర్వాత ఆయన సభ నుండి వెళ్లిపోతున్న  సమయంలో కొందరు మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు.  మంత్రి కాన్వాయ్ పై చెప్పులు, కుర్చీలతో దాడికి దిగారు.

 పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడంతో మంత్రి మల్లారెడ్డి ఈ దాడి నుండి తప్పించుకున్నారు. . ఈ ఘటనపై మంత్రి మల్లారెడ్డి కూడా సీరియస్ గా స్పందించారు. తనను హత్య చేసేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కుట్ర చేశారని ఆరోపించారు. ఘట్‌కసర్ లో తనపై దాడికి ప్రయత్నించింది రేవంత్ రెడ్డి అనుచరులేనని ఆయన ఆరోపించారు.ఈ విషయమై టీఆర్ఎస్ నేతలు ఇవాళ ఘట్ కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. 

నిన్న జరిగిన  ఘటన సమయంలో తీసిన వీడియో దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. రెడ్ల సింహాగర్జన కవరేజీ చేసిన మీడియా దృశ్యాలతో పాటు స్థానికంగా సెల్ ఫోన్లలో ఈ దాడి దృశ్యాలను రికార్డు చేసిన వారి నుండి కొన్ని దృశ్యాలను సేకరించి 16 మందిపై  కేసు నమోదు చేశారు. 

ఎఫ్ఐఆర్ లో ఉన్న వారిలో ఇద్దరు కాంగ్రెస్ నేతలతో పాటు రేవంత్ రెడ్డి అనుచరులు కూడా ఉన్నారని  టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కూడా టీఆర్ఎస్ నేతలు రేవంత్ అనుచరులు, కాంగ్రెస్ నేతల పేర్లను కూడా ఇచ్చారు.

ఈ నెల 24వ తేదీన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తాను టీడీపీలో ఉన్న సమయం నండి రేవంత్ రెడ్డి తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని కూడా ఆయన ఆరోపించారు. మల్కాజిగిరి ఎంపీ సీటు రాకుండా రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నాలను వివరించారు. ఈ పరిణామాలను తాను చంద్రబాబుకు వివరించడంతో తనకే చంద్రబాబు టికెట్ ఇచ్చారన్నారు. తాను మల్కాజిగిరి ఎంపీ అయిన తర్వాత కూడా తనను బ్లాక్ మెయిల్ చేశారన్నారు. రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ సర్వ నాశనం అవుతుందన్నారు. చివరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కూడా రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తారని ఆయన విమర్శించారు. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios