తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు ఎక్కువయ్యాయి. ఇంకా అభ్యర్థుల ఎంపిక జరక్కముందే అసంతృప్తులు  తయారయ్యారు. తమకు టికెట్ రాదని భావిస్తున్న వారు బహిరంగంగానే పార్టీకి, నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇలాంటి పరిస్థితి జనగామ జిల్లాలో కూడా చోటుచేసుకుంది.   

పాలకుర్తి నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా జంగా రాఘవరెడ్డి ని ఎంపిక చేస్తే ఆయనకు తాము సహకరించే ప్రసక్తే లేదని  టీపీసీసీ కార్యదర్శి బిల్లా సుధీర్‌రెడ్డి స్పష్టం చేశారు. కేవలం రౌడీ షీట్ ప్రాతిపదికనే టికెట్లిస్తే ఆయనకంటే తానే సీనియర్ రౌడీ షీటర్‌నని తనకే టికెట్ ఇవ్వాలని అదిష్టానికి సూచించారు.  ఇంకా సుధీర్ రెడ్డి ఏమన్నారో కింది వీడియోలో చూడండి.

వీడియో

"