Asianet News TeluguAsianet News Telugu

జనగామ పంచాయతీ.. జంగా రాఘవరెడ్డిపై టీపీసీసీ కన్నెర్ర, షోకాజ్ నోటీసులు జారీ

జనగామ (janagaon) డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డికి (janga raghava reddy ) టీపీసీసీ (tpcc) షోకాజ్ నోటీసులు (show cause notice) జారీ చేసింది. జంగా రాఘవరెడ్డితో పాటు మరో ఇద్దరు కాంగ్రెస్ నాయకులకు కూడా షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర నాయత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈ నోటీసులు జారీ చేసినట్లు టీపీసీసీ తెలిపింది. ఈ నెల 29లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. 

tpcc issues show cause notice to janagaon dcc president janga raghava reddy
Author
Hyderabad, First Published Nov 23, 2021, 4:55 PM IST

జనగామ (janagaon) డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డికి (janga raghava reddy ) టీపీసీసీ (tpcc) షోకాజ్ నోటీసులు (show cause notice) జారీ చేసింది. జంగా రాఘవరెడ్డితో పాటు మరో ఇద్దరు కాంగ్రెస్ నాయకులకు కూడా షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర నాయత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈ నోటీసులు జారీ చేసినట్లు టీపీసీసీ తెలిపింది. ఈ నెల 29లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. 

జనగామ మండల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులను జంగా రాఘవరెడ్డి.. పొన్నాల (ponnala lakshmaiah) ప్రమేయం లేకుండా అంతా తన వర్గం వారిని నియమించుకున్నారు. దీంతో ఈ పంచాయితీ పీసీసీ బాస్ రేవంత్ రెడ్డి (revanth reddy) వరకు వెళ్లింది. అయితే రేవంత్.. జంగా చేపట్టిన నియామకాలను రద్దు చేసి.. కొత్తగా పొన్నాల ఇచ్చిన లిస్ట్ ను ఫైనల్ చేశారు. దీంతో ఇరు వర్గాల పంచాయితీ రచ్చకెక్కింది. 

ALso Read:తెలంగాణ కాంగ్రెస్‌లో ‘ఈటల’ చిచ్చు.. భట్టివిక్రమార్క‌పై కేసీ వేణుగోపాల్ ఆగ్రహం

తాజాగా పార్టీ శిక్షణా తరగతులలో జంగా వర్గీయులు గొడవకు దిగడంతో ఇష్యూ కాస్తా సీరియస్ అయ్యింది. ఈ అంశాన్ని పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో చర్చించారు. సమావేశంలో మెజారిటీ నాయకులు జంగా రాఘవరెడ్డి చర్యను క్రమశిక్షణ రాహిత్యంగా అభిప్రాయ పడ్డారు. ఇక ఆయనకు షోకాజ్ నోటీస్ ఇవ్వాలని పార్టీ పెద్దలు నిర్ణయించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios