Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్‌లో ఢిల్లీ చిచ్చు: అత్యవసరంగా పీసీసీ కార్యవర్గం భేటీ, ఉత్తమ్‌పై ఫిర్యాదుపై ప్రధాన చర్చ

ఉత్తమ్‌పై ఫిర్యాదుపై చర్చ

TPCC committee emergency meeting today in Hyderabad


హైదరాబాద్:పీసీసీ అత్యవసర సమావేశం  గురువారం సాయంత్రం  జరగనుంది. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డిపై కొందరు పార్టీ నేతలు ఫిర్యాదు చేశారనే ఆరోపణలపై ఈ సమావేశంలో  చర్చించనున్నారు.  పార్టీలో చోటు చేసుకొన్న పరిణామాలపై  చర్చించనున్నారు. ఢిల్లీలో  చోటు చేసుకొన్న పరిణామాలపై పార్టీ సీనియర్లు  తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని  సమాచారం.


రెండు రోజుల క్రితం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ప్రజా ప్రతినిధులు, నేతలు  ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులతో పాటు  కాంగ్రెస్ పార్టీలో  పరిణామాలపై కూడ రాహుల్‌తో చర్చించారని సమాచారం. అంతేకాదు  పార్టీ పరిణామాలపై చర్చించేందుకుగాను 40 మంది పార్టీ నేతల లిస్టును కూడ రాహుల్ గాంధీకి ఇచ్చారు.

కాంగ్రెస్ పార్టీ చీఫ్  ఉత్తమ్‌కుమార్ రెడ్డిపై కొందరు నేతలు  ఫిర్యాదు చేశారని కూడ ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంఛార్జీ కుంతియా ఈ విషయాన్ని ఖండించారు.  కానీ,ఈ విషయమై  విచారణ చేస్తానని  కుంతియా అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వేడి రాజుకొంది.

అయితే ఢిల్లీ పరిణామాలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కాస్త ఆగ్రహంగానే ఉంది.  గురువారం సాయంత్రం పీసీసీ కార్యకవర్గం అత్యవసరంగా సమావేశం కానుంది.  ఈ సమావేశంలో  ఢిల్లీలో చోటు చేసుకొన్న పరిణామాలపై చర్చించనున్నారు.

పార్టీ వ్యవహరాలపై పార్టీ రాష్ట్ర ఇంఛార్జీతో  చర్చించాలి, లేదా పార్టీ సీనియర్లతో చర్చించాలని కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు.ఈ విషయమై సీనియర్లు కూడ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కు వెన్నుదన్నుగా నిలిచారు. ఢిల్లీ పరిణామాలపై చర్చించేందుకు అందుబాటులో ఉన్న సీనియర్లు సమావేశానికి హజరుకావాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ నేతలకు గురువారం నాడు సమాచారాన్ని పంపారు.

ఢిల్లీలో తనకు వ్యతిరేకంగా కొందరు ఫిర్యాదు చేయడంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడ అసంతృప్తితో ఉన్నారని సమాచారం. ఈ విషయమై  చర్చించేందుకుగాను  తెలంగాణ పీసీసీ చీఫ్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.  పార్టీ సీనియర్లు కూడ  ఉత్తమ్ ను మద్దతుతో ఉన్నారు. సీనియర్లు ఉత్తమ్‌తో గురువారం నాడు ఫోన్లో చర్చించారని సమాచారం.ఈ సమాచారం మేరకు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారని సమాచారం.

ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో పీసీసీ చీఫ్ పై ఫిర్యాదు చేసే పద్దతి సరికాదనే అభిప్రాయంతో సీనియర్లు ఉన్నారు. అయితే ఢిల్లీకి వెళ్ళిన పార్టీ నేతలు ఈ స మావేశానికి హజరు అవుతారా లేదా అనే విషయమై  సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Follow Us:
Download App:
  • android
  • ios