ఆత్మహత్యలు, అప్పులు, అవినీతిలో తెలంగాణ నంబర్‌ వన్‌....అభివృద్దిలో కాదు : ఉత్తమ్

First Published 3, Sep 2018, 11:21 AM IST
tpcc chief uttam press meet on pragathi nivedana sabha
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతి నివేధిక సభలో చెప్పిన ప్రతి మాటా అబద్దమేనని టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఈ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అభివృద్దిలో నెంబర్ వన్ గా మారిందని కేసీఆర్ చెప్పారని, కానీ ఆయన చెప్పినట్లు అభివృద్దిలో కాదు రైతుల ఆత్మహత్యలు, అవినీతిలో నెంబర్ వన్ గా మారిందన్నారు. అంతే కాదు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడంలో కేసీఆర్ నెంబర్ వన్ గా నిలిచారని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. 

ఆదివారం టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ప్రగతి నివేధన సభ ముగిసిన తర్వాత ఉత్తమ్ తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కేసీఆర్ పై, ప్రగతి నివేధన సభలో కేసీఆర్ చేసిన ప్రసంగంపై విరుచుకుపడ్డారు. ఈ మీడియా సమావేశంలో పీసీసీ మాజీ చీఫ్‌లు పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, మండలిలో కాంగ్రెస్‌ పక్షనేత షబ్బీర్‌ అలీ, సీనియర్ నాయకులు వి.హనుమంతరావు, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ లు పాల్గొన్నారు.

ప్రగతి నివేధిక సభకు కావాలని బాగా హైప్ క్రియేట్ చేశారని, అయినా ఆ సభ అట్టర్ ప్లాప్ గా  జరిగిందన్నారు ఉత్తమ్. ఈ సభకు ప్రపంచం నివ్వెర పోయేలా ప్రజలు వచ్చారని, కానీ ప్రపంచం నివ్వెరపోయేలా అవినీతి కూడా జరిగిందని అన్నారు. ఈ సభకోసం ఖర్చు చేసిన రూ.300కోట్లకు లెక్క చెప్పాలని ఉత్తమ్ ప్రశ్నించారు. అంతే కాదు పార్టీ సభకు రాష్ట్రంలోని సగం ఆర్టీసి బస్సులను వాడుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఇలా ప్రజా ధనాన్ని తన స్వప్రయోజనాల కోసం వాడుతున్న సీఎంను గద్దెదింపడానికి ఇకనుంచి ''కేసీఆర్ హఠావో తెలంగాణ బచావో'' అన్న నినాదంతో ముందుకు వెళతామని ఉత్తమ్ తెలిపారు.

ఇక గత  ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీలగురించి ఉత్తమ్ మాట్లాడారు. దళితులకు మూడెకరాల భూమి, ముస్లీం రిజర్వేషన్లు ఏమయ్యాయో చెప్పాలన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పేరుతో భారీగా అవినీతి జరిగినట్లు ఉత్తమ్ పేర్కొన్నారు. ఇక జోనల్ విధానాన్ని తానే తీసుకువచ్చినట్లు కేసీఆర్ ప్రచారం సాగుతోందని, ఆయన కేవలం జోన్లల్లో ఉద్యోగ శాతాన్ని మాత్రమే పెంచారన్నారు. ఇక కరెంట్ విషయంలో మళ్లీ అవే పాత అబద్దాలే వల్లెవేశారని ఉత్తమ్ సీఎం కేసీఆర్ పై ద్వజమెత్తారు.
   
loader