వామనరావు హత్య విషయాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావిస్తానన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. వామనరావు వాంగ్మూలం ఇచ్చిన తర్వాత కూడా ఎలాంటి చర్య లేకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

వామనరావు హత్యపై సీబీఐ విచారణ చేయకుంటే ఈ కేసును కొట్టివేసే అవకాశం ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యమంలో కీలకంగా పని చేసిన న్యాయవాదులకు తెలంగాణలో రక్షణ లేదని.. వామనరావు వాగ్మూలంలో అధికార పార్టీ నేతల పేర్లు చెప్పినా పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ఉత్తమ్ ప్రశ్నించారు.

ఇండియన్ మెడికల్ అస్సోసియేషన్ వాళ్లకు ప్రొటెక్ట్ యాక్ట్ ఎలా ఉందో.. న్యాయవాదులకు కూడా అలాంటి చట్టాన్ని తీసుకురావాలని టీపీసీసీ చీఫ్ డిమాండ్ చేశారు.

అలాగే న్యాయవాదులు కూడా పోరాటం ఉధృతం చేయాలని ఆయన సూచించారు. లాయర్ల పోరాటానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని ఉత్తమ్ వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి సరైన బుద్ది చెప్పాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.