మున్సిపల్ ఎన్నికలు తెలంగాణ సమాజాన్ని, ప్రజలను అవమానపరిచే విధంగా జరిగాయన్నారు టీపీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. మంగళవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. మంత్రి కేటీఆర్ దిగజారే విధంగా ఎన్నికలు నిర్వహించారని ఉత్తమ్ ఆరోపించారు.

Also Read:మండలిపై జగన్ వ్యాఖ్యలకు కేకే కౌంటర్: కేవీపీ ఓటుపై కీలక వ్యాఖ్య

నేరేడుచర్ల మున్సిపాలిటీలో కాంగ్రెస్-సీపీఎం పొత్తు పెట్టుకుని పోటీ చేశాయని మొత్తం 15 కౌన్సిలర్ సీట్లకు గాను 8 సీట్లు తమ కూటమికి వచ్చాయని, టీఆర్ఎస్‌కు 7 సీట్లు వచ్చాయని గుర్తుచేశారు.

కాంగ్రెస్ తరపున ఛైర్మన్ అభ్యర్ధిగా దళితుడైన ప్రకాశ్ అనే వ్యక్తిని నిర్ణయించామని.. అతని ఎన్నిక సైతం దాదాపు ఖరారు అయ్యిందని అంతా భావించారని ఉత్తమ్ తెలిపారు. గత కొన్ని రోజులుగా ఓటర్ల జాబితాను ఎన్నోసార్లు మార్చారని.. టీఆర్ఎస్‌కు అనుకూలంగా ఉండేలా పావులు కదిపారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.

Also Read:నేరేడుచర్ల వివాదం: ఉత్తమ్, కేవీపీల అరెస్ట్, మిర్యాలగుడాకు తరలింపు

తండ్రికొడుకులు ఫామ్ హౌస్‌లోనో, ప్రగతి భవన్‌‌లోనో కూర్చొని ఓటర్ లిస్ట్ రాసుకుంటే సరిపోయేదని ఆయన సెటైర్లు వేశారు. మిషన్ భగీరథ, లిక్కర్ స్కామ్‌లలో సంపాదించిన సొమ్మును మున్సిపల్ ఎన్నికల్లో ఉపయోగించడం వల్లే టీఆర్ఎస్‌కు ఇన్ని మున్సిపాలిటీలు దక్కాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.

వార్డుల రిజర్వేషన్, నామినేషన్ల దాఖలకు మధ్య సమయం లేదన్నారు. నేరేడుచర్ల మున్సిపాలిటీ వ్యవహారం అధికార దుర్వినియోగానికి పరాకాష్టగా ఉందని ఉత్తమ్ ఆరోపించారు.