కేటీఆర్... మీ తండ్రి చెప్పిన మాట ఓసారి విను : ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్వీట్

tpcc chief uttam kumar reddy reacts on ktr tweet
Highlights

కేసీఆర్ పై కేటీఆర్ కు నమ్మకం లేదా అని ప్రశ్నించిన ఉత్తమ్...

టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి కేటీఆర్ కు ట్విట్టర్ ద్వారా మరోసారి గట్టిగా జవాబిచ్చారు. తెలంగాణ ఏర్పాటు కోసం సోనియాగాంధీ చేసిందేమీ లేదని, తెలంగాణ ప్రజలే కొట్లాడి రాష్ట్రాన్ని తెచ్చుకున్నారన్న కేటీఆర్ వ్యాఖ్యలకు ఉత్తమ్ ట్విట్టర్ ద్వారా కాస్త ఘాటుగానే స్పందించారు. సోనియాగాంధీ ఏం చేసిందో తెలియాలంటే నీ తండ్రి మాటల్లోనే వినమంటూ ఓ వీడియోను ఉత్తమ్ ట్విట్టర్ లో షేర్ చేశారు.

సీఎం కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటలను మరోసారి ఉత్తమ్ గుర్తుచేశారు. సోనియా గాంధీ వల్లే తెలంగాణ కల సాకారమైందని, ఇవ్వడం కాస్త ఆలస్యమైనా తెలంగాణను ఏర్పాటుకు సహకరించింది మాత్రం ఆమెనని, ఇది కాదన్నవాడు మూర్ఖుడేనని అసెంబ్లీలో సీఎంగా కేసీఆర్ మాట్లాడిన మాటలను ఉత్తమ్ తన ట్వీట్ లో గుర్తుచేశారు. ఇపుడు తెలంగాణ సోనియా వల్ల రాలేదంటున్న కేటీఆర్ తండ్రి కేసీఆర్ మాటలను సమ్మతించడం లేనట్లేనా అంటూ ఉత్తమ్ ప్రశ్నించారు.

 

అంతేకాకుండా ఎప్పుడూ ఎదుటివారిపై దుమ్మెత్తిపోసే టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ హామీలను, ప్రకటనలను ఓ సారి గుర్తు చేసుకోవాలని ఉత్తమ్ అన్నారు. వారు ఇతర పార్టీల నాయకులను మోసగాళ్లు, వంచకులు అనే మందు తమ నాయకుడి గురించి తెలుసుకోవాలని సూచించారు. యూపిఎ ప్రభుత్వం లో కేంద్ర మంత్రిగా, ప్రస్తుతం సీఎం గా ఉన్నపుడు కూడా కేసీఆర్ కేవలం పదివిని మాత్రమే అనుభవిస్తున్నారని విమర్శించారు. అమర వీరుల త్యాగాలను మంత్రిగాను, సీఎం గాను కేసీఆర్ ఎప్పుడూ పట్టించుకోలేదన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ చేతిలో ఒక్కసారి కాదు, రెండు సార్లు మోసపోయారని ఉత్తమ్ కుమార్ రెడ్డి తర ట్వీట్ లో తెలిపారు. 

 

loader