తెలంగాణ నుండి టీఆర్ఎస్‌ను పారదోలాల్సిన  అవసరం ఉందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. క్విట్ టీఆర్ఎస్ పేరుతో  పనిచేయాల్సిన అవసరం నెలకొందన్నారు.


హైదరాబాద్: తెలంగాణ నుండి టీఆర్ఎస్‌ను పారదోలాల్సిన అవసరం ఉందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. క్విట్ టీఆర్ఎస్ పేరుతో పనిచేయాల్సిన అవసరం నెలకొందన్నారు. 

హైద్రాబాద్‌లో గురువారం నాడు సేవాదళ్ కాంత్రి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన టీఆర్ఎస్‌పై నిప్పులు చెరిగారు. ఓయూలో రాహుల్ గాంధీ పర్యటనను అడ్డుకొనేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 

 ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవేర్చని తెలంగాణ సీఎంను ఓయూ విద్యార్థులు ప్రశ్నించాలని టీపీసీసీ చీఫ్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. రాహుల్ గాంధీ అన్నివర్గాల ప్రజలను కలుసుకొంటారని చెప్పారు. 

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతి రోజూ మోడీకి చెంచాగిరి చేస్తూ తమపై విమర్శలు చేయడం సరైందా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణను ఎవరిచ్చారో చెప్పాలని ఆయన కేసీఆర్ ను డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ రాజకీయాలు చేయడం కోసం రావడం లేదన్నారు. తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన విషయాన్ని ఆయన మరోసారి గుర్తు చేశారు.