సాగర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ సీఈసీకి ఫిర్యాదు చేశారు టీపీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. టీఆర్ఎస్ ప్రజలను భయభ్రాంతులను చేస్తోందని ఆయన ఆరోపించారు
సాగర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ సీఈసీకి ఫిర్యాదు చేశారు టీపీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. టీఆర్ఎస్ ప్రజలను భయభ్రాంతులను చేస్తోందని ఆయన ఆరోపించారు.
అనుమతి లేని వాహనాల్లో వచ్చి డబ్బులు పంచుతున్నారని... స్థానిక పోలీసులపై తమకు నమ్మకం లేదని ఉత్తమ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. సాగర్‌కు కేంద్ర బలగాలను పంపాలని ఆయన ఈసీని కోరారు.
Also Read:హలియాలో కేసీఆర్ సభకు తొలగిన అడ్డంకులు: రైతుల హౌస్ మోషన్ పిటిషన్ తిరస్కరణ
మెడికల్ ఎమర్జెన్సలో లక్ష మందితో సీఎం కేసీఆర్ సభ ఎలా పెడతారని ఉత్తమ్ ప్రశ్నించారు. పేదలు కరోనా బారినపడేలా చేస్తే ఎలా అంటూ ఆయన నిలదీశారు. జనం ఎలా పోతే నాకేంటి రాజకీయం ముఖ్యమని కేసీఆర్ అనుకుంటున్నారని ఉత్తమ్ ఎద్దేవా చేశారు.
సాగర్‌లో స్థానికేతర నాయకులను తక్షణమే వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఈసీని కోరారు. సీఎం ఒత్తిడితో అధికారులు ఎన్నికల నిబంధనలు పాటించడం లేదని ఉత్తమ్ ఆరోపించారు. కలెక్టర్‌కు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యంమని ఉత్తమ్ ఫిర్యాదు చేశారు.
