వరి ధాన్యం కొనుగోలు విషయమై బీజేపీ, టీఆర్ఎస్ లు నాటకాలు ఆడుతున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి లేఖ రాశారు.
హైదరాబాద్: బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేంద్రానికి లేఖ రాసిచ్చి రాష్ట్ర రైతుల ప్రయోజనాలను కేసీఆర్ ఫణంగా పెట్టారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు.
Paddy ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి తెలంగాణ సీఎం KCR కు Revanth Reddy సోమవారం నాడు లేఖ రాశారు. ఈ లేఖలో 10 ప్రశ్నలను సంధించారు రేవంత్ రెడ్డి. తెలంగాణ నుండి ఇక నుండి బాయిల్డ్ రైస్ ఇవ్వమని 2021 అక్టోబర్ 4న కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది నిజం కాదా అని ఆ లేఖలో ప్రస్తావించారు. రాష్ట్ర రైతుల ప్రయోజనాలను ఫణంగా పెట్టి కేంద్రానికి లేఖ రాసిచ్చే అధికారం ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు.
కేంద్రానికి లేఖ రాసిచ్చి ఇప్పుడు ధర్నాలు చేయడం సరైందా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీలో ధర్నాలు, నిరసనలు అంటూ నాటకాలు ఆడితే రైతులు మీ మోసాలను గ్రహించలేరా అని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో టీఆర్ఎస్ కు చిత్తశుధ్ది లేదన్నాను. ధాన్యం కొనుగోళ్ల కారణంగా రూ.7500 కోట్ల నష్టం వచ్చిందని కేసీఆర్ ప్రకటించలేదా అని ఆయన అడిగారు. ఇకపై కొనుగోలు కేంద్రాలు ఉండవని గత ఫిబ్రవరిలో కేసీఆర్ చేసిన ప్రకటనను ఆయన గుర్తు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వరి ధాన్యం కొనుగోలు విషయమై నాటకాలు ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయని కారణంగా దళారుల చేతిలో రైతులు మోసపోతున్నారన్నారు.
