‘కరెంట్’ కామెంట్లతో పార్టీని ఇరకాటంలోకి నెట్టిన రేవంత్.. రంగంలోకి కాంగ్రెస్ హైకమాండ్
Hyderabad: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన నేపథ్యంలో ఈ ఏడాది చివర్లో తెలంగాణలో జరిగే ఎన్నికలను పర్యవేక్షించి వ్యూహరచన చేయాలని, కర్నాటక తరహాలో పార్టీని విజయతీరాలకు చేర్చాలని పార్టీ అధిష్ఠానం కేపీసీసీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సహా ఇతర నేతలతో చర్చలు జరుపుతోందని సమాచారం. ఇలాంటి తరుణంలో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్ పై చేసిన వ్యాఖ్యలు పార్టీకి ప్రతికూలంగా మారాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దిగింది.
Free electricity-Congress High Command: కర్నాటక ఎన్నికల్లో గెలుపు తర్వాత కాంగ్రెస్ దక్షిణాది రాష్ట్రాల్లో దూకుడుగా ముందుకు సాగుతోంది. అలాగే, త్వరలో ఎన్నికలు జరిగే తెలంగాణలో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. రాహుల్ గాంధీ ఖమ్మం సభ తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ జోష్ మరింతగా పెరిగింది. ఇదే సమయంలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన నేపథ్యంలో ఈ ఏడాది చివర్లో తెలంగాణలో జరిగే ఎన్నికలను పర్యవేక్షించి వ్యూహరచన చేయాలని, కర్నాటక తరహాలో పార్టీని విజయతీరాలకు చేర్చాలని పార్టీ అధిష్ఠానం కేపీసీసీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సహా ఇతర నేతలతో చర్చలు జరుపుతోందని సమాచారం. ఇలాంటి తరుణంలో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్ పై చేసిన వ్యాఖ్యలు పార్టీకి ప్రతికూలంగా మారాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దిగింది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే స్పష్టం చేశారు.
తెలంగాణలో జోష్ మీదున్న కాంగ్రెస్ కు ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ రేవంత్ రెడ్డి ఇటీవల ఉచిత విద్యుత్ పై పలు వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో ఓ కార్యక్రమంలో ఉచిత కరెంట్ గురించి రేవంత్ మాట్లాడుతూ.. కమీషన్ల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల ఉచిత కరెంట్ నినాదాన్ని తెచ్చిందని ఆరోపించారు. అలాగే, రైతులకు 8 గంటలు నిరంతర విద్యుత్ అందిస్తే చాలంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ తో పాటు రేవంత్ రెడ్డిని సైతం ఇరకాటంలో పడేశాయి. ఇదే విషయాన్ని ఎత్తిచూపుతూ అధికార బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్, రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేశాయి. రైతు వ్యతిరేక పార్టీ అంటూ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహా పలువురు నేతలు చేసిన వ్యాఖ్యలు ఈ విషయాన్ని కాంగ్రెస్ తలనొప్పులు తెచ్చే విధంగా మారడంతో పార్టీ హై కమాండ్ రంగంలోకి దిగింది.
తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్ పై చేసిన వ్యాఖ్యలుఆయన వ్యక్తిగతమైనవని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే స్పష్టం చేశారు. మ్యానిఫెస్టోలో పెట్టినవే తుది నిర్ణయాలనీ, ఏ విషయమైన కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అని ఠాక్రే వివరించారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్‌పై తానా సభల్లో తాను చేసిన వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ వక్రీకరించారని ఆరోపించారు. తన వ్యాఖ్యలను ఎడిట్ చేసి కేటీఆర్ అతితెలివి ప్రదర్శించారంటూ మండిపడ్డారు. అయితే, రేవంత్ సెల్ఫ్ గోల్ బెడిసికొట్టిందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఉచిత విద్యుత్ తో పాటు ఎమ్మెల్యే సీతక్క సీఎం అభ్యర్థి అంటూ చేసిన వ్యాఖ్యలు సైతం పార్టీలో అలజడి సృష్టించడంతో కాంగ్రెస్ హై కమాండ్ రంగంలోకి దిగింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే ఈ విషయంలో మరిన్ని విషయాలు ప్రస్తావించినప్పటికీ.. మరికొంతమంది కాంగ్రెస్ అగ్రనాయకులు రంగంలోకి దిగనున్నారని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కర్నాటక తరహా విజయాన్ని తెలంగాణలోనూ రిపీట్ చేయాలని కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోందని చెబుతున్నాయి.