ఇక మీదట గాంధీ భవన్‌లో ఆందోళనలు చేస్తే తీవ్ర చర్యలు వుంటాయని కాంగ్రెస్ నేతలకు రేవంత్ వార్నింగ్ ఇచ్చారు. ఏదైనా అభ్యంతరాలు వుంటే పెద్దల దృష్టికి రావాలని, అంతేకానీ గాంధీ భవన్‌లో ధర్నాలు చేస్తే ఊరుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. 

సొంత పార్టీ కార్యకర్తలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఇక మీదట గాంధీ భవన్‌లో ఆందోళనలు చేస్తే తీవ్ర చర్యలు వుంటాయని రేవంత్ వార్నింగ్ ఇచ్చారు. గాంధీ భవన్ మెట్లపై ధర్నాలు చేస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని పీసీసీ క్రమశిక్షణా కమిటీ అధ్యక్షుడు చిన్నారెడ్డికి రేవంత్ సిఫారసు చేశారు. అలాగే నియామకాల విషయంలో ఏదైనా అభ్యంతరాలు వుంటే పెద్దల దృష్టికి రావాలని, అంతేకానీ గాంధీ భవన్‌లో ధర్నాలు చేస్తే ఊరుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. 

ALso Read: ‘కరెంట్’ కామెంట్లతో పార్టీని ఇరకాటంలోకి నెట్టిన రేవంత్.. రంగంలోకి కాంగ్రెస్ హైకమాండ్

కాగా.. డీసీసీలు, మండల కమిటీ నియామకాల విషయంలో అన్యాయం జరిగిందంటూ కొందరు నేతలు గత కొన్నిరోజులుగా గాంధీ భవన్ ప్రాంగణంలో ఆందోళనలు చేస్తున్నారు. ఆలేరు నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలకు గాను ఏడు చోట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ ఐలయ్య, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి అనుకూలంగా వున్న వారిని నియమించారని వారు ఆరోపిస్తున్నారు. అయితే రేవంత్ కార్యాలయానికి వచ్చే సమయంలోనూ పలుమార్లు నేతలు, కార్యకర్తలు ఆయన కంటపడ్డారు.