పార్టీ కోసం కష్టపడితే ఇంటికే బీ ఫాంలు: రేవంత్ రెడ్డి

పార్టీ కోసం పనిచేసే వారిని కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. నిన్న హైద్రాబాద్ లో కాంగ్రెస్ కార్యకర్తలపై జరిగిన లాఠీచార్జీలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు గాయపడ్డారు. గాయపడిన కాంగ్రెస్ కార్యకర్తలను  రేవంత్ రెడ్డి పరామర్శించారు.

TPCC chief Revanth Reddy visits Balmuri Venkat in hospital

హైదరాబాద్: పార్టీ కోసం కష్టపడితే పార్టీ వారిని గుర్తించి గౌరవిస్తుందని టీపీసీసీ(tpcc chief) చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు.  పోలీసుల లాఠీచార్జీలో గాయపడిన కాంగ్రెస్ (congress)కార్యకర్తలను ఆదివారం నాడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy) పరామర్శించారు. 

also read:ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జీ... హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్ధి వెంకట్‌కు గాయాలు

నిరుద్యోగ, విద్యార్ధి జంగ్ సైరన్  కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలపై లాఠీచార్జీ జరిగింది.ఈ లాఠీచార్జీలో గాయపడిన  ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్  సహా పలువురిని రేవంత్ రెడ్డి పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ కోసం పనిచేసేవారిని పార్టీ గుర్తింపు ఇస్తోందన్నారు.  హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో వెంకట్ టికెట్ అడగలేదన్నారు. కానీ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నాడని గుర్తించి వెంకట్ కు (balmuri venkat)హుజూరాబాద్ టికెట్ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

టికెట్ల కోసం పార్టీలో పైరవీలుండవన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారి ఇంటికే టికెట్ తీసుకొచ్చి ఇస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రతి నిరుద్యోగ యువకుడికి కేసీఆర్ బకాయి ఉన్నాడని ఆయన చెప్పారు. మహబూబ్ నగర్ లో నిరుద్యోగ జంగ్ సైరన్ నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. శ్రీకాంతాచారి స్పూర్తితో కాంగ్రెస్ ఉద్యమిస్తోందని రేవంత్ రెడ్డి తెలిపారు.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios