Asianet News TeluguAsianet News Telugu

నేడు చంచల్‌గూడ జైలుకు రేవంత్ రెడ్డి: సికింద్రాబాద్ విధ్వంసంలో అరెస్టైన అభ్యర్ధులతో ములాఖత్

అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసానికి పాల్పడి అరెస్టైన ఆర్మీ అభ్యర్ధులను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి శుక్రవారం నాడు చంచల్‌గూడ జైలులో పరామర్శించనున్నారు. ఈ జైలులో ఉన్న ఆర్మీ అభ్యర్ధులకు న్యాయవాదులను కూడా కాంగ్రెస్ పార్టీ నియమించే అవకాశం ఉంది. 

TPCC Chief Revanth Reddy To Go Chanchalguda
Author
Hyderabad, First Published Jun 24, 2022, 9:55 AM IST


హైదరాబాద్: TPCC  చీఫ్ Revanth Reddy  శుక్రవారం నాడు Chanchalguda జైలుకు వెళ్ల‌నున్నారు. Secunderabad రైల్వేస్టేషన్‌ విధ్వసం కేసులో అరెస్టైన  అభ్యర్థులతో  Revanth Reddy ములాఖత్ కానున్నారు. అరెస్టైన అభ్యర్ధులతో  రేవంత్  రెడ్డి మాట్లాడి వారి సమస్యలు తెలుసుకొంటారు.  Jailలో ఉన్న అభ్య‌ర్థుల కోసం న్యాయ‌వాదుల‌ను కూడా నియ‌మించాలని Congress పార్టీ భావిస్తుంది. 

Agneepathకు వ్యతిరేకంగా ఈ నెల 27వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జ‌ర‌గ‌నున్నాయి. కార్య‌క్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజ‌రుకావాల‌ని, కేంద్రం తీసుకొచ్చిన అగ్నిప‌థ్‌ను తీవ్ర‌స్థాయిలో వ్య‌తిరేకించాల‌ని పిల‌పునిచ్చారు.

మరో వైపు అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం వెనుక  ప్రైవేట్ డిఫిన్స్ అకాడమీల పాత్ర ఉందరి రైల్వే సిట్ బృందం గుర్తించింది. ఈ కేసులో సాయి డిఫెన్స్ అకాడమీకి  ఆవుల సుబ్బారావును రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విధ్వంసం వెనుక ఆవుల సుబ్బారావు, శివల పాత్రను పోలీసులు ప్రస్తావిస్తున్నారు. 

ఈ విషయమై రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక సమాచారాన్ని పొందుపర్చారు. జూన్ 17కు ఒక్కరోజు ముందుగానే సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు వచ్చారని, హకీంపేట సోల్జర్స్‌ వాట్సప్‌ గ్రూప్‌లో ఆర్మీ అభ్యర్థులతో వీరిద్దరూ వేర్వేరుగా తీసుకున్న ఫొటోలున్నాయని నివేదించారు. 

హకీంపేట్ సోల్జర్స్ గ్రూప్‌లో ఆందోళనకారులకు మద్దతిస్తున్నామని పోస్టులు పెట్టారని.. ఆందోళనకు కావల్సిన లాజిస్టిక్స్ సమకూర్చినట్టు పోలీసులు నిర్ధారించారు. కీలక నిందితులతో సుబ్బారావు ఫోన్‌లో మాట్లాడినట్లు గుర్తించారు. ఈ కేసులో ఏ-2గా ఉన్న ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పృథ్వీరాజు సాయి డిఫెన్స్ అకాడమీ విద్యార్ధి అని, విద్వంసంలో కీలకంగా వ్యవహరించిన పలువురు సాయి డిఫెన్స్ అకాడమీ స్టూడెంట్స్‌గా నిర్ధారించారు. 

also read:secunderabad violence : సికింద్రాబాద్ అల్లర్ల కేసులో ట్విస్ట్ .. ఎఫ్‌ఐఆర్‌లోకి ఆవుల సుబ్బారావు పేరు

ఇక, ఈ కేసులో ఇప్పటివరకు 63మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు. ఇప్పటికే 55మందిని అరెస్ట్ చేసి.. రిమాండ్‌కు తరలించారు. మరో ఎనిమిది మంది పరారీలో ఉన్నారని.. వారి కోసం గాలింపు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. మరోవైపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ విధ్వంసానికి సంబంధించి సేకరించిన ప్రాథమిక ఆధారాలు, అరెస్టయిన నిందితుల నుంచి రికార్డు చేసిన వాంగ్మూలాలను బుధవారం కోర్టుకు సమర్పించారు.

ఇకపోతే.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకున్న విధ్వంసంకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అల్లర్లు, రైల్వే ఆస్తుల ధ్వంసం, రైళ్లకు నిప్పుపెట్టడం.. వెనక కొందరు కీలకంగా వ్యవహరించినట్టుగా పోలీసులు గుర్తించారు. ఒకరిద్దరు తొలుత రైల్వే బోగీల్లోకి వెళ్లి నిప్పు పెట్టినట్టుగా కనిపిస్తున్న కొన్ని వీడియోలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. కొన్ని తెలుగు న్యూస్ చానల్స్ ఈ దృశ్యాలను ప్రసారం చేశాయి. ఆ వీడియోల్లో ఆదిలాబాద్ జిల్లాకు చెందినకు పృథ్వీరాజ్ కూడా ఉన్నాడు.. రైలు బోగీలోకి వెళ్లి పేపర్లకు నిప్పు పెట్టి సీట్లకు నిప్పటించాడు. ఆ దృశ్యాలను వీడియోలు కూడా తీయించుకున్నాడు. ఒకరిద్దరు ఇలాంటి చర్యలు దిగిన తర్వాత మరికొందరు రైల్వే ఆస్తుల ధ్వంసం చేయడానికి, రైల్వే బోగీలకు నిప్పుపెట్టినట్టుగా తెలుస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios