టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బెంగళూరు వెళ్లారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి , కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్‌తో భేటీ అయ్యేందుకే ఆయన బెంగళూరు వెళ్లినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. డీకే శివకుమార్‌కు తెలంగాణ ఎన్నికల్లో కీలక బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం.
అసెంబ్లీ ఎన్నికనల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌లో వాతావరణం వేడెక్కింది. అభ్యర్ధుల ఎంపికపై కసరత్తుతో పాటు వైఎస్ షర్మిల తన పార్టీని హస్తంలో పార్టీలో విలీనం చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తుండటంతో ఏ పార్టీలోనూ లేని హడావుడి కాంగ్రెస్‌లో కనిపిస్తోంది. కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధించడంతో తెలంగాణలోనూ అధికారాన్ని అందుకుని సార్వత్రిక ఎన్నికల్లో ఆత్మ విశ్వాసంతో బరిలోకి దిగాలని కాంగ్రెస్ భావిస్తోంది. కాంగ్రెస్ హైమాండ్ నేరుగా ఢిల్లీ నుంచి పరిణామాలను పర్యవేక్షిస్తోంది. ఇవాళ దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్‌కు రానుండగా.. త్వరలో కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ , స్క్రీనింగ్ కమిటీలు అభ్యర్ధులను ఎంపిక చేసే పని మొదలెట్టనున్నాయి.
ఇలాంటి పరిణామాల నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బెంగళూరు వెళ్లారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి , కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్‌తో భేటీ అయ్యేందుకే ఆయన బెంగళూరు వెళ్లినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. షర్మిలను కాంగ్రెస్ తీసుకొచ్చే బాధ్యతను డీకేనే తీసుకున్నారు. పలుమార్లు ఆమెను ఢిల్లీలో వెంటబెట్టుకెళ్లిన ఆయన.. ఫలప్రదంగా చర్చలు ముగిసేలా చొరవ తీసుకున్నట్లుగా సమాచారం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర లేకపోవడంతో షర్మిల వ్యవహారాన్ని సెట్ చేయాలని రేవంత్ భావిస్తున్నారట. ఈ క్రమంలోనే శివకుమార్ సూచనలు, సలహాలు తీసుకుంటారని సమాచారం.
Also Read: వైఎస్ఆర్టీపీ విలీనం.. వైఎస్ షర్మిల ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే ?
మరోవైపు.. కర్ణాటకలోనే పార్టీ శ్రేణులను, నేతలను ఏకతాటిపైకి తీసుకొచ్చి కాంగ్రెస్‌కు అధికారాన్ని కట్టబెట్టారు డీకే శివకుమార్. సమస్యల పరిష్కారం, అధికార పార్టీపై విమర్శలు, సోషల్ మీడియా ప్రచారం, పోల్ మేనేజ్‌మెంట్ ఇలా అన్నింటిని ఆయన దగ్గరుండి చూసుకున్నారు. ఇదే సక్సెస్‌ఫుల్ ఫార్ములా తెలంగాణలోనూ అమలు చేయాలని రేవంత్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్‌కు తెలంగాణ ఎన్నికల్లో కీలక బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. రేవంత్ బెంగళూరు నుంచి వస్తేనే గానీ ఈ వ్యవహారాలపై క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
