Asianet News TeluguAsianet News Telugu

పేదల తలరాతలు మారాలంటే కేసీఆర్ సర్కార్ పోవాలి : పాదయాత్రలో రేవంత్ రెడ్డి

పేదల జీవితాల్లో మార్పు రావాలంటే కేసీఆర్ పాలన పోవాలన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ 9 ఏళ్లలో పాలనలో పెత్తందారులు, పెట్టుబడిదారులు బాగుపడ్డారని..పేదవాళ్లు మాత్రం ఆత్మహత్య చేసుకున్నారని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు.

tpcc chief revanth reddy slams telangana cm kcr
Author
First Published Feb 6, 2023, 7:24 PM IST

జంపన్న వాగు నీరు తాగిన ప్రజలు ప్రభుత్వంపై పౌరుషాన్ని ప్రదర్శించేందుకు సిద్ధంగా వున్నారని అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సోమవారం ములుగు జిల్లా మేడారంలో హాత్ సే హాత్ జోడో అభియాన్ పాదయాత్రను ప్రారంభించారు రేవంత్. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. కాంగ్రెస్ పార్టీ పాఠశాలలు ప్రారంభిస్తే, బీఆర్ఎస్ సర్కార్ వాటికి తాళం వేసి లంబాడీ పిల్లలకు విద్యను దూరం చేసిందన్నారు. పది బడ్జెట్‌లు ప్రవేశపెట్టిన కేసీఆర్.. సంక్షేమ రంగానికి చేసింది ఏంటని రేవంత్ ప్రశ్నించారు. అలా లెక్క తీస్తే ప్రతి నియోజకవర్గానికి 20 వేల కోట్లు రావాల్సి వుందని ఆయన అన్నారు. 

ఇందిరమ్మ ఆనాడు ఇల్లు ఇచ్చిందని, దళితులకు డబుల్ బెడ్‌రూం ఇల్లు వచ్చాయా అని రేవంత్ ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి, ఫీజు రీయంబర్స్‌మెంట్, రుణమాఫీ జరిగిందా అని ఆయన నిలదీశారు. మరి రూ.25 లక్షల కోట్లు ఎక్కడికిపోయాయో చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రూ.25 లక్షల కోట్లను రాబందుల సమితి దోచుకుని తిన్నదని ఆయన ఆరోపించారు. కేసీఆర్ 9 ఏళ్లలో పాలనలో పెత్తందారులు, పెట్టుబడిదారులు బాగుపడ్డారని..పేదవాళ్లు మాత్రం ఆత్మహత్య చేసుకున్నారని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. పేదల జీవితాల్లో మార్పు రావాలంటే కేసీఆర్ పాలన పోవాలని ఆయన అన్నారు. యువతకు ఉద్యోగులు రావాలన్నా, రైతులకు గిట్టుబాటు ధర రావాలన్న ప్రభుత్వం మారాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. 

ALso REad: వన దేవతలకు పూజలు: మేడారం నుండి రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభం

కాగా.. హత్ సే హత్  జోడో  అభియాన్ కార్యక్రమంలో భాగంగా  రేవంత్ రెడ్డి  ఈ పాదయాత్రకు  శ్రీకారం చుట్టారు. తొలి విడతలో 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి పాదయాత్ర నిర్వహించనున్నారు. 60 రోజుల పాటు ఆయన యాత్ర నిర్వహించనున్నారు. రాష్టంలోని  119 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా యాత్ర సాగేలా  రేవంత్ రెడ్డి  రూట్  మ్యాప్ ను సిద్దం చేసుకుంటున్నారు. నిజానికి గత నెల  26వ తేదీ నుండి  యాత్రను ప్రారంభించాలని  రేవంత్ రెడ్డి  ప్లాన్  చేసుకున్నారు. కానీ కొన్ని కారణాలతో పాదయాత్ర  వాయిదా పడింది. ఎట్టకేలకు ఇవాళ మేడారం  సమ్మక్క సారలమ్మ నుండి  రేవంత్ రెడ్డి యాత్రను ప్రారంభించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios