Asianet News TeluguAsianet News Telugu

వన దేవతలకు పూజలు: మేడారం నుండి రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభం

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  పాదయాత్ర  మేడారం నుండి  ఇవాళ ప్రారంభమైంది.  మేడారంలో  సమ్మక్క, సారలమ్మ  గద్దెల వద్ద పూజలు చేసి  యాత్రను ప్రారంభించారు రేవంత్ రెడ్డి.

 TPCC Chief  Revanth Reddy Padayatra Begins From Medaram
Author
First Published Feb 6, 2023, 4:39 PM IST

హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  సోమవారంనాడు  మేడారం నుండి  పాదయాత్రను ప్రారంభించారు.  ఇవాళ ఉదయం హైద్రాబాద్ నుండి  ఆయన  మేడారానికి  చేరకున్నారు.  మేడారంలో  సమ్మక్క సారలమ్మలకు  పూజలు నిర్వహించారు.  అక్కడి నుండి  ఆయన   తన పాదయాత్రను ప్రారంభించారు.  

మేడారానికి  రేవంత్ రెడ్డి  చేరుకున్న వెంటనే  కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు  బాణసంచా  కాల్చారు.  రేవంత్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు . సమ్మక్క, సారలమ్మ  గద్దెల వద్ద  రేవంత్ రెడ్డి  ప్రత్యేకంగా  పూజలు నిర్వహించారు. అనంతరం  ఆయన  పార్టీ నేతలతో  కలిసి పాదయాత్రను ప్రారంభించారు. 

హత్ సే హత్  జోడో  అభియాన్ కార్యక్రమంలో భాగంగా  రేవంత్ రెడ్డి  ఈ పాదయాత్రకు  శ్రీకారం చుట్టారు. తొలి విడతలో  50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో  రేవంత్ రెడ్డి  పాదయాత్ర  నిర్వహించనున్నారు.  60 రోజుల పాటు ఈ యాత్ర  నిర్వహించాలని  రేవంత్ రెడ్డి ప్లాన్  చేసుకున్నారు.  

రాష్టంలోని  119 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా యాత్ర సాగేలా  రేవంత్ రెడ్డి  రూట్  మ్యాప్ ను సిద్దం  చేసుకుంటున్నారు.  తొలి విడతలో  50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో  రేవంత్ రెడ్డి పాదయాత్ర  చేయనున్నారు. గత నెల  26వ తేదీ నుండి  యాత్రను ప్రారంభించాలని  రేవంత్ రెడ్డి  ప్లాన్  చేసుకున్నారు. కొన్ని కారణాలతో పాదయాత్ర  వాయిదా పడింది. ఇవాళ మేడారం  సమ్మక్క సారలమ్మ నుండి  రేవంత్ రెడ్డి యాత్రను ప్రారంభించారు.

రేవంత్ రెడ్డి  పాదయాత్ర అంశానికి సంబంధించి రెండు రోజుల క్రితం  పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణిక్ రావు ఠాగూర్ వద్ద  మాజీ ఎమ్మెల్యే  మహేశ్వర్ రెడ్డి  అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.    ఏదో ఒక రూపంలో  ప్రజల్లో  ఉండాలనేది  పార్టీ  ఆలోచనగా  ఠాక్రే  చెప్పారు. పార్టీకి చెందిన  ఇతర సీనియర్లు  కూడా  పాదయాత్రకు  త్వరలోనే  శ్రీకారం చుట్టనున్నారు . 

ఈ ఏడాది చివర్లో  తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.. ఈ దఫా ఎన్నికల్లో  తెలంగాణలో అధికారంలోకి రావాలని  ఆ పార్టీ భావిస్తుంది.  రాహుల్ గాంధీ కూడా తెలంగాణపై ప్రత్యేకంగా  ఫోకస్ పెట్టారు. కర్ణాటక,తెలంగాణ రాష్ట్రాలకు  సునీల్ కనుగోలును  కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా  ఆ పార్టి నియమించుకుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios