అర పర్సెంట్ వున్న నీ సామాజికి వర్గంలో నీ ఇంట్లోనే నాలుగు పదవులు వున్నాయని.. మరి 12 శాతమున్న మాదిగలకు మంత్రివర్గంలో స్థానం ఇచ్చారా అని రేవంత్ ప్రశ్నించారు. గజ్వేల్‌లో జరిగిన దళిత గిరిజన దండోరా సభలో ఆయన ప్రసంగించారు. అల్లుడినో, కొడుకునో తొలగించి ఒక మాదిగ బిడ్డకు మంత్రి పదవి ఇవ్వాలని రేవంత్ డిమాండ్ చేశారు. 

అర పర్సెంట్ వున్న నీ సామాజికి వర్గంలో నీ ఇంట్లోనే నాలుగు పదవులు వున్నాయని.. మరి 12 శాతమున్న మాదిగలకు మంత్రివర్గంలో స్థానం ఇచ్చారా అని రేవంత్ ప్రశ్నించారు. అల్లుడినో, కొడుకునో తొలగించి ఒక మాదిగ బిడ్డకు మంత్రి పదవి ఇవ్వాలని రేవంత్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో స్వేచ్ఛ లేదని.. సామాజిక న్యాయం లేదని ఆయన మండిపడ్డారు. ఆరోగ్యశ్రీలో కరోనా చికిత్స చేర్చకుండా ఎంతోమంది ప్రాణాల్ని బలితీసుకున్నారని ఎద్దేవా చేశారు. పేదలకు విద్యను దూరం చేసిన వ్యక్తి కేసీఆర్ అంటూ దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కుటుంబానికి ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి.. ఆయన ఏం వ్యాపారం చేశారని రేవంత్ ఆరోపించారు. 

Also Read:బంధువుల ఆస్తులు మునగకుండా.. పేదల భూములు గుంజుకున్నాడు: కేసీఆర్‌పై రేవంత్ విమర్శలు

తెల్లారేవరకూ చెప్పినా ఒడవని దు:ఖం ఇవాళ తెలంగాణలో ఉందని.. కాబట్టి, రాబోయే 19 నెలలు తెలంగాణ భవిష్యత్తు నిర్ణయించాలని రేవంత్ అన్నారు. ఈ తెలంగాణను పట్టి పీడిస్తున్న కల్వకుంట్ల కుటుంబం నుంచి విముక్తి చేయాల్సి ఉందని చెప్పారు. ఈ తుది దశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ విముక్తి కోసం అందరూ పని చేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పని చేసిన వారిని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గుర్తుంచుకుంటుందని... వారికి ఐడీ కార్డులు ఇస్తుందన్నారు. అందరం ఈ 19 నెలలు పని చేసి సోనియమ్మ రాజ్యం తీసుకొద్దామని రేవంత్ తెలిపారు. తెలంగాణ ప్రజలు కన్ను తెరిస్తే కేసీఆర్ కాలిపోతాడంటూ చురకలు వేశారు.