కర్ణాటకలో కాంగ్రెస్‌ను దెబ్బతీసేయత్నం, మధ్యవర్తి అతనే: కేసీఆర్ పై రేవంత్ రెడ్డి
కర్ణాటకలో కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు కేసీఆర్ ప్రయత్నించారని రేవంత్ రెడ్డి చెప్పారు.ఈ విషయమై ఆధారాలు కూడా లభ్యమయ్యాయన్నారు.
హైదరాబాద్: కర్ణాటకలో కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు కేసీఆర్ ప్రయత్నించారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆదివారంనాడు ఆయన హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు ఈ విషయమై ఆధారాలు కూడా బయటకు వవచ్చాయని రేవంత్ రెడ్డి చెప్పారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇందుకు మధ్యవర్తిత్వం వహించారని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ లో గెలిచి బీఆర్ఎస్ కి వెళ్లిన రోహిత్ రెడ్డి మళ్లీ మోసం చేసే పనిలో ఉన్నారన్నారు. అమ్మడం కొనడం పైలెట్ రోహిత్ రెడ్డి కి అలవాటుగా మారిందన్నారు. కేసీఆర్ ను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ నమ్మదన్నారు.
కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో ఓడించడం ద్వారా కేసీఆర్ కు ఏం లాభమని కూడా జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రశ్నించారు. బీజేపీని ఓడించడమే కేసీఆర్ లక్ష్యమన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ను ఓడించేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఇటీవల విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ విమర్శలకు కొనసాగింపుగా పైలెట్ రోహిత్ రెడ్డి పేరును తెరమీదికి తీసుకు వచ్చారు. రేవంత్ రెడ్డి చేసిన విమర్శలపై కర్ణాటక పీసీసీ చీఫ్ డికె శివకుమార్ స్పందించారు.ఈ విషయమై వాస్తవాలు తెలుసుకున్న తర్వాత స్పందిస్తానన్నారు.
also read:కర్ణాటకలో రేవంత్ ఆరోపణల కలకలం.. కాంగ్రెస్‌ను ఓడించడం ద్వారా కేసీఆర్‌కు ఏం లాభం?: హెచ్‌డీ కుమారస్వామి
వచ్చే ఎన్నికల్లో కర్ణాటక రాష్ట్రంలో బీఆర్ఎస్ , జేడీఎస్ లు కలిసి పోటీచేయనున్నాయి. ఈ విషయాన్ని గత ఏడాది అక్టోబర్ మాసంలో హైద్రాబాద్ లో కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ఆవిర్భావం రోజున, ఢిల్లీలో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం రోజున కూడా కుమారస్వామి పాల్గొన్నారు. కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందే కేసీఆర్ జాతీయ పార్టిని ప్రకటించే అవకాశం ఉందని కుమారస్వామి సోషల్ మీడియాలో గత ఏడాది ప్రకటించిన విషయం తెలిసిందే.