పాదాల మీద నడిచే యాత్రే పాదయాత్ర... రేవంత్ నోట షర్మిల డైలాగ్
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్ర డైలాగ్ ను టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సెటైర్లు వేసారు.
హైదరాబాద్ : పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర... ఆడ పిల్ల అంటే ఆడ పిల్ల ఈడ పిల్ల కాదు... సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతున్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల వ్యాఖ్యలివి. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రపై షర్మిల డైలాగ్స్ సోషల్ మీడియా వైరల్ గా మారిన విషయం తెలిసిందే. పాదాల మీద నడిచే యాత్ర పాదయాత్ర... రేవంత్ పాదాల మీద నడిచేకంటే వాహనాల్లోనే ఎక్కువగా ప్రయాణిస్తున్నారని... దీన్ని పాదయాత్ర అంటారా? అంటూ షర్మిల వ్యాఖ్యానించారు.
షర్మిల పాదయాత్ర డైలాగ్ పై ట్రోలింగ్స్, రీల్స్, కామెడీ వీడియోలు ఏ స్థాయిలో వచ్చాయంటే చివరకు అవి రేవంత్ రెడ్డి వరకు చేరాయి. దీంతో ఆయన కూడా షర్మిల పాదయాత్ర వ్యాఖ్యలను సెటైరికల్ గా వాడుతూ అందరినీ నవ్వించారు. గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ షర్మిల స్టైల్లోనే పాదయాత్ర డైలాగ్ చెప్పారు రేవంత్ రెడ్డి.
Read More బండి సంజయ్ ను స్పాన్సర్ చేస్తున్నదే కేసీఆర్... ఖర్చంతా గంగులదే : పొన్నం ప్రభాకర్ సంచలనం (వీడియో)
ఇటీవల కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సమావేశానికి సిఎల్పి నేత భట్టి విక్రమాక్ర హాజరుకాకపోవడంతో మీడియా ప్రతినిధులు రేవంత్ ను ప్రశ్నించారు. దీంతో భట్టి పాదయాత్రలో వున్నారని... అందువల్లే కాంగ్రెస్ సమావేశానికి హాజరుకాలేదని రేవంత్ తెలిపారు. ఈ క్రమంలోనే పాదయాత్ర ప్రారంభించిన నాటినుండి భట్టి వాహనం ఎక్కలేదని... ఆయన పాదాల మీద నడిచే పాదయాత్ర చేస్తున్నారని అన్నారు. ఇలా తన పాదయాత్ర సమయంలో షర్మిల చేసిన వ్యాఖ్యలను రేవంత్ రిఫీట్ చేయడంతో అక్కడ ఉన్నవారంతా నవ్వుకున్నారు.
షర్మిల పాదయాత్ర డైలాగ్ :
తన పాదయాత్రను రేవంత్ పాదయాత్రతో పోల్చకూడదని... అసలు ఆయనది పాదయాత్రే కాదని షర్మిల అన్నారు. తానేమో కేవలం నడుచుకుంటూనే ఎక్కడికైనా వెళుతున్నానని... రేవంత్ మాత్ర కొంత దూరం నడుస్తూ, మరికొంత దూరం వాహనంలో వెళుతున్నారని అన్నారు. పాదాల మీద నడిచే యాత్రనే పాదయాత్ర అంటారని... తనది మాత్రమే పాదయాత్ర అని అన్నారు. పాదయాత్ర చేస్తుంటే ఎంత బాధ వుంటుందో కూడా షర్మిల వివరించారు. నడిచినడిచి కాళ్లు నొప్పులు వస్తాయని, కడుపులో తిప్పుతుంటుందని అని అన్నారు. తాను రోజులతరబడి కుటుబానికి, ఇంటికి దూరంగా వుంటూ ఎండనక వాననక పాదయాత్ర చేస్తున్నానని అన్నారు.
అయితే పాదాల మీద నడిచే యాత్ర పాదయాత్ర అంటూ షర్మిల డైలాగ్స్ కు సంబంధించిన వీడియోపై ట్రోలర్స్ కన్నుపడింది. ఇంకేముంది ఆ వీడియో ఓ ఆటాడుకోవడంతో అదికాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఆ తర్వాత షర్మిలపై ఏ మాట్లాడినా ట్రోల్స్ చేయడం ప్రారంభించారు. ఇలా వైరల్ గా మారిన షర్మిల వ్యాఖ్యలపై తాజాగా రేవంత్ సెటైరికల్ గా స్పందించారు.