కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు‌పై కేసీఆర్ వ్యాఖ్యలు: మండిపడ్డ రేవంత్ రెడ్డి

కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుపై  బీఆర్ఎస్ సమావేశంలో  కేసీఆర్ వ్యాఖ్యలను  రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 

TPCC  Chief  Revanth Reddy Responds  On  KCR  Comments  lns

హైదరాబాద్:  కర్ణాటకలో  కాంగ్రెస్ గెలుపు పై  తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తప్పుబట్టారు.  గురువారంనాడు  గాంధీ భవన్ లో  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలో  కాంగ్రెస్ గెలుపు గెలుపే కాదని  నిన్న  జరిగిన బీఆర్ఎస్  విస్తృత స్థాయి సమావేశంలో  కేసీఆర్  చేసిన వ్యాఖ్యలపై  రేవంత్ రెడ్డి మండిపడ్డారు.కర్ణాటక  ప్రజల తీర్పును  ప్రపంచమంతా  స్వాగతించిందన్నారు. కానీ  ఈ గెలుపును  కేసీఆర్ తేలికగా తీసుకున్నారని తెలిపారు. 

 మోడీని ఎదుర్కొనేందుకు  కాంగ్రెస్ పార్టీతో పనిచేయాల్సిన  అవసరం ఉందని పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ  చేసిన వ్యాఖ్యలను గుర్తు  చేశారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత  మమత బెనర్జీ  ఈ వ్యాఖ్యలు  చేసిందన్నారు.

మోడీని  ఢీకొడతానని  కేసీఆర్ గతంలో  ప్రగల్భాలు పలికారని  రేవంత్ రెడ్డి గుర్తు  చేశారు.  కర్ణాటకలో జేడీఎస్ కు  మద్దతిచ్చి  ఎన్నికల తర్వాత  బీజేపీతో   పొత్తు పెట్టుకొనేందుకు  కేసీఆర్ తెర వెనుక  చేసిన  పన్నాగాలను తాము బయటపెట్టినట్టుగా  రేవంత్ రెడ్డి  వివరించారు.కర్ణాటక ప్రజల తీర్పు  కేసీఆర్ కు కంటగింపుగా మారిందని  రేవంత్ రెడ్డి  ఆరోపించారు. తెలంగాణ ఇవ్వకపోతే  కేసీఆర్   కుటుంబం బిచ్చమెత్తుకునేదన్నారు. 

కులాలు, మతాల మధ్య  చిచ్చు పెట్టి కర్ణాటకలో  గెలవాలని  బీజేపీ ప్రయత్నించిందని  ఆయన  ఆరోపించారు.  బీజేపీ కుట్రలను  కర్ణాటక ప్రజలు తిప్పికొట్టాట్టి కాంగ్రెస్ ను గెలిపించారని రేవంత్ రెడ్డి  చెప్పారు. 

ఈశాన్య రాష్ట్రంలో  ప్రజల ఆస్తులు, ప్రాణాలకు  రక్షణ లేకుండా పోయిందని ఆయన  ఆరోపించారు.  దేశంలో ప్రజాస్వామ్యం బతకాలని  భావించినవారంతా బయటకు వచ్చి కర్ణాటక  ప్రజలు ఇచ్చిన తీర్పును అభినందించారన్నారు.  కర్ణాటక ప్రజలు మోడీని తిప్పి కొట్టారని  రేవంత్ రెడ్డి  తెలిపారు. అణచివేతకు గురౌతున్నవారికి  అండగా  ఉండాలని చాలామంది  కోరుకుంటున్నారని రేవంత్ రెడ్డి  తెలిపారు.

 కర్ణాటక ఎన్నికల సమయంలో  ప్రజలను  కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.  కేంద్ర మంత్రులంతా   కర్ణాటకలోనే  మోహరించారని  చెప్పారు.  అయినా కూడ  ప్రజలు  కాంగ్రెస్ ను గెలిపించారని రేవంత్ రెడ్డి చెప్పారు.

మోడీ బ్రాండ్  కాలం చెల్లిందన్నారు. ఈడీ , సీబీఐ దాడులను  కర్ణాటక ప్రజలు తిప్పికొట్టారని  రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది కాంగ్రెస్,  తెలంగాణ  ఇచ్చింది కాంగ్రెసేనని  రేవంత్ రెడ్డి చెప్పారు.  కాంగ్రెస్ పార్టీ అమ్మవంటిందన్నారు. అలాంటి పార్టీని అందరూ  ఆదరించాలని  ఆయన  కోరారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios