సీనియర్ మహిళా ఐఎఎస్ అధికారి స్మితా సభర్వాల్  నివాసంలోకి  డిప్యూటీ తహసీల్దార్  ఆనంద్ కుమార్ రెడ్డి  ప్రవేశించడంపై   టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి స్పందించారు.  రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఈ ఘటన  రుజువు చేస్తుందన్నారు. 

హైదరాబాద్:ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే మహిళా ఐఎఎస్ అధికారి స్మితా సభర్వాల్ కు రక్షణ లేకుండా పోయిందని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. సింగరేణి కాలనీలో ఆరేళ్ల బిడ్డకే కాదు సీఎంఓలో పనిచేసే మహిళా ఐఎఎస్ అధికారికి కూడా రక్షణ లేకుండా పోయిందని రేవంత్ రెడ్డి విమర్శించారు.. కేసీఆర్ పాలనలో మినిమం గవర్నెన్స్, మాగ్జిమమ్ రాజకీయాల కారణంగా ఈ ఫలితం నెలకొందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆడబిడ్డలు జాగ్తత్తగా ఉండాలని ఆయన కోరారు. ట్విట్టర్ వేదికగా రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. 

also read:ఆ సమయంలో ఎలా రక్షించుకోవాలో ఆలోచించా: సీనియర్ ఐఎఎస్ స్మితా సభర్వాల్

తన నివాసంలో అపరిచిత వ్యక్తి ప్రవేశించిన విషయాన్ని ట్విట్టర్ వేదికగా స్మితా సభర్వాల్ ప్రస్తావించారు. ఆ సమయంలో తనను తాను రక్షించుకొనే విషయమై స్పందించినట్టుగా చెప్పారు. సీఎంఓ కార్యాలయంలో పనిచేసే సీనియర్ ఐఎఎస్ అధికారి స్మితా సభర్వాల్ నివాసంలోకి మేడ్చల్ జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్ గా పనిచేసే ఆనంద్ కుమార్ రెడ్డి వెళ్లాడు.

Scroll to load tweet…

అర్ధరాత్రి పూట ఆనంద్ కుమార్ రెడ్డి ఐఎఎస్ అధికారి స్మితా సభర్వాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై స్మితా సభర్వాల్ భద్రతా సిబ్బంది డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్ కుమార్ రెడ్డిని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనలో ఆనంద్ కుమార్ రెడ్డితో పాటు అతని డ్రైవర్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. మేజిస్ట్రేట్ వీరిద్దరికి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు.