తన ఫిర్యాదుపై అసోం సీఎం హిమంత బిశ్వశర్మపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ లో సెక్షన్లు మార్పులు చేయడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: అసోం సీఎం Himanta Biswa Sarmaపై నమోదు చేసిన కేసుకు సంబంధించిన సెక్షన్ల మార్పిడిపై టీపీసీసీ చీఫ్ Revanth Reddy పోలీసు ఉన్నతాధికారులతో వాదనకు దిగారు. ఎప్ఐఆర్ లో సెక్షన్లు మార్చడంతో తాను ఇచ్చిన ఫిర్యాదు స్వరూపమే మారి పోతోందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తాను ఇచ్చిన మేరకు FIR లో సెక్షన్లు ఉండాలని ఆయన డిమాండ్ చేశారు.
Rahul Gandhiపై Assam CM హిమంత బిశ్వ శర్మ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ బృందం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసే సమయంలోనే అసోం సీఎం చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్ నకు చెందిన పెన్ డ్రైవ్ తో పాటు ఆయా సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని రేవంత్ రెడ్డి కోరారు.
అయితే అసోం సీఎం హిమంత బిశ్వ శర్మపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసును బుధవారం నాడు నమోదు చేశారు పోలీసులు. అయితే తాను పేర్కొన్న సెక్షన్లలో కాకుండా 504,505 సెక్షన్లను చేర్చడం వల్ల తాను ఇచ్చిన ఫిర్యాదు స్వరూపాన్నే మార్చివేశారని రేవంత్ రెడ్డి పోలీసులతో చెప్పారు. ఈ విషయమై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రెండోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 153 ఏ, 294, 505 (2), 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని రెండోసారి అసోం సీఎం హిమంత బిశ్వశర్మపై బుధవారం నాడు ఫిర్యాదు చేశారు. పోలీసులు తాను ఫిర్యాదులో పేర్కొన్నట్టుగా సెక్షన్లను ఎఫ్ఐఆర్ లో లేకపోతే కోర్టు నుండి డైరెక్షన్ తెచ్చుకొంటానని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
Uttarakhand Assembly Election 2022 ప్రచారంలో భాగంగా అసోం సీఎం ఈ నెల 11వ తేదీన రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. 2016లో Pakistan పై జరిగిన Surgical Strike కు సంబంధించిన ఆధారాలను బయట పెట్టాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.ఈ విషయమై హిమంత బిశ్వశర్మ స్నందించారు. రాహుల్ గాంధీ మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ తనయుడే అని చెప్పడానికి ఆధారాలు అడగలేదు కదా అని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేగాయి. ఈ వ్యాఖ్యలను పలువురు ఖండించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఈ వ్యాఖ్యలను ఖండించారు.
అసోం సీఎంHimanta Biswa Sarma వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు ఇచ్చారు. మోతీలాల్ నెహ్రు, జవహర్ లాల్ నెహ్రు, ఇందిరా గాంధీలు దేశం కోసం సేవ చేశారని ఈ ఫిర్యాదులో కాంగ్రెస్ నేతలు గుర్తు చేశారు. 1990 అక్టోబర్ 19న రాజీవ్ గాంధీ హైద్రాబాద్ లో సద్భావన యాత్రను నిర్వహించారని కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఐపీసీ 153 ఏ, 505(2), 294 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని కాంగ్రెస్ నేతలు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ ఫిర్యాదులపై కేసులు నమోదు చేయనందుకు ఇవాళ పోలీస్ కార్యాలయాల ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది.అయితే కాంగ్రెస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ విషయమై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్టు సీపీ సీవీ ఆనంద్ ప్రకటించారు. అయితే ఎఫ్ఐఆర్ లో సెక్షన్లను మార్చాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
