సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క టీపీసీసీ  చీఫ్ రేవంత్ రెడ్డి ఇవాళ భేటీ అయ్యారు.

ఖమ్మం: సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి శుక్రవారంనాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని తల్లెంపాడులో భేటీ అయ్యారు. మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర ప్రారంభించిన తర్వాత రేవంత్ రెడ్డి మల్లు భట్టి విక్రమార్కలు పాదయాత్రలో కలవడం ఇదే ప్రథమం. జూలై రెండో తేదిన ఖమ్మంలో నిర్వహించే బహిరంగ సభపై రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారు. 

ఆదిలాబాద్ జిల్లా నుండి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర నిర్వహిస్తున్నారు జూలై రెండో తేదీన పాదయాత్ర ముగియనుంది. దీని సందర్భంగా ఖమ్మంలో జన గర్జన పేరుతో కాంగ్రెస్ పార్టీ సభ నిర్వహిస్తుంది. ఈ సభకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భారీగా జన సమీకరణ చేయనుంది. ఇదే సభలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన అనుచరులతో కాంగ్రెస్ లో చేరనున్నారు.

ఖమ్మంలో జన గర్జన సభ విజయవంతం చేసేందుకుగాను అవలంభించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలతో రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారు. హైద్రాబాద్ నుండి రేవంత్ రెడ్డి నేరుగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క బస చేసిన తల్లెంపాడుకు చేరుకున్నారు. ఖమ్మం సభను విజయవంతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. 

also read:జూలై 2న కాంగ్రెస్‌లోకి: ప్రకటించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ఖమ్మం సభను విజయవంతం చేసేందుకు గాను ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కమిటీలను ఏర్పాటు చేసింది. మరోవైపు ఖమ్మంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జీలతో పాటు ఇతర ముఖ్య నేతలతో రేవంత్ రెడ్డి చర్చించనున్నారు.