తెలంగాణ పోలీసులపై మండిపడ్డారు టీపీసీసీ చీఫ్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి. ఈ మేరకు ఆయన లోక్‌సభ స్పీకర్ (lok sabha speaker) ఓంబిర్లాకు (om birla) ఫిర్యాదు చేశారు. గడిచిన వారం రోజుల్లో రెండు సార్లు తనను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచి హక్కులను కాలశారని ఆరోపించారు. పదే పదే గృహనిర్బంధం చేస్తూ తన హక్కులకు భంగం కలిగిస్తున్నారని రేవంత్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.
తెలంగాణ పోలీసులపై మండిపడ్డారు టీపీసీసీ చీఫ్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి. ఈ మేరకు ఆయన లోక్‌సభ స్పీకర్ (lok sabha speaker) ఓంబిర్లాకు (om birla) ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న రైతులను కలిసి చర్చించి భరోసా కల్పించేందుకు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లాలనుకుంటే... తనను వెళ్లనీకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.
గడిచిన వారం రోజుల్లో రెండు సార్లు తనను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచి హక్కులను కాలశారని ఆరోపించారు. పదే పదే గృహనిర్బంధం చేస్తూ తన హక్కులకు భంగం కలిగిస్తున్నారని రేవంత్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. లిఖితపూర్వక సమాచారం లేకుండా పోలీసులు ఇంటిచుట్టూ మోహరిస్తురని రేవంత్ దుయ్యబట్టారు. అనుమతి లేకుండా అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించారని ఆయన లోక్‌సభ స్పీకర్‌కు రాసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, స్వేచ్ఛను కాపాడాలని ఓం బిర్లాకు విజ్ఞప్తి చేశారు.
Also Read:వరంగల్ రచ్చబండ: రేవంత్ రెడ్డి హౌస్ అరెస్టు, పోలీసులపై ఆగ్రహం
అంతకుముందు రేవంత్ రెడ్డిని శుక్రవారం పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. వరంగల్ లో రచ్చబండ కార్యక్రమాన్ని తలపెట్టిన రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. దాంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులపై రేవంత్ రెడ్డి తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ లో తలపెట్టిన రచ్చబండ కార్యక్రమానికి బయలుదేరేందుకు రేవంత్ రెడ్డి శుక్రవారం ఉదయం సిద్ధపడ్డారు. అక్కడికి వెళ్లకుండా ఆయనను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.
ఇటీవల ఈ నెల 27వ తేదీన కూడా పోలీసులు Revanth Reddyని ఇలాగే హౌస్ అరెస్టు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆయన రచ్చబండ కార్యక్రమాన్ని తలపెట్టారు. అందుకు గాను ఆయన సోమవారంనాడు సిద్ధిపేట జిల్లా Erravelliలో రచ్చబండకు పిలుపునిచ్చారు. కరోనా, ఓమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలోనే కాకుండా ఇతర కారణాల రీత్యా రేవంత్ రెడ్డి రచ్చబండ కార్యకర్మానికి పోలీసులు అనుమతి నిరాకరించారు.
