వరంగల్ రచ్చబండ: రేవంత్ రెడ్డి హౌస్ అరెస్టు, పోలీసులపై ఆగ్రహం
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు మరోసారి హౌస్ అరెస్టు చేశారు. వరంగల్ లో తలపెట్టిన రచ్చబండ కార్యక్రమానికి వెళ్లకుండా రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.
హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. వరంగల్ లో రచ్చబండ కార్యక్రమాన్ని తలపెట్టిన రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. దాంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులపై రేవంత్ రెడ్డి తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ లో తలపెట్టిన రచ్చబండ కార్యక్రమానికి బయలుదేరేందుకు రేవంత్ రెడ్డి శుక్రవారం ఉదయం సిద్ధపడ్డారు. అక్కడికి వెళ్లకుండా ఆయనను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.
ఇటీవల ఈ నెల 27వ తేదీన కూడా పోలీసులు Revanth Reddyని ఇలాగే హౌస్ అరెస్టు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆయన రచ్చబండ కార్యక్రమాన్ని తలపెట్టారు. అందుకు గాను ఆయన సోమవారంనాడు సిద్ధిపేట జిల్లా Erravelliలో రచ్చబండకు పిలుపునిచ్చారు. కరోనా, ఓమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలోనే కాకుండా ఇతర కారణాల రీత్యా రేవంత్ రెడ్డి రచ్చబండ కార్యకర్మానికి పోలీసులు అనుమతి నిరాకరించారు.
Also Read: కాంగ్రెస్‌లో రచ్చబండ 'రచ్చ': రేవంత్‌పై సీనియర్ల గుర్రు
రైతులు వరి పంట వేయకూడదని కేసీఆర్ ఓ వైపు చెబుతూ తనకు చెందిన 150 ఎకరాల్లో వరి పంట వేశారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయడానికి ఎర్రవెల్లిలో రచ్చబండ నిర్వహిస్తానని చెప్పి అందుకు సిద్ధపడ్డారు. పోలీసులు హౌస్ అరెస్టు చేయడంతో ఆయన అక్కడికి వెళ్లలేకపోయారు.
రేవంత్ రెడ్డి రచ్చబండ నేపథ్యంలో పోలీసులు ఆ రోజు సిద్ధిపేట జిల్లాలో కాంగ్రెసు నాయకులను ముందుగానే House arrest చేశారు. కొంత మందిని అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెసు నాయకులు ఎర్రవెల్లిలో రచ్చబండ నిర్వహించి తీరుతామని చెప్పినప్పటికీ అది జరగలేదు.
Also Read: రేవంత్ రెడ్డిపై జగ్గారెడ్డి ఫిర్యాదు: సోనియా, రాహుల్‌గాంధీలకు లేఖ
ఇదిలావుంటే, రేవంత్ రెడ్డి రచ్చబండ కార్యక్రమంపై సొంత కాంగ్రెసు పార్టీ నేతలే తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి రచ్చబండకు ఏకపక్షంగా పిలుపునిచ్చారని జగ్గారెడ్డి, వి. హనుమంతరావు వంటి సీనియర్ నేతలు తప్పుట్టారు. ఎర్రవెల్లి రచ్చబండ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు జగ్గారెడ్డి చెప్పారు. రేవంత్ రెడ్డి తీరుపై పార్టీ అధిష్టానానికి లేఖ రాస్తానని ఆయన చెప్పారు.