తెలంగాణలో జరగబోయే ఎన్నికలు ఫ్యూడలిజానికి, ప్రజలకు మధ్య జరుగుతున్న ఎన్నికలని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ భట్టి విక్రమార్క అన్నారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోయే కార్యక్రమాలపై చర్చించినట్లు తెలిపారు.
హైదరాబాద్: తెలంగాణలో జరగబోయే ఎన్నికలు ఫ్యూడలిజానికి, ప్రజలకు మధ్య జరుగుతున్న ఎన్నికలని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ భట్టి విక్రమార్క అన్నారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోయే కార్యక్రమాలపై చర్చించినట్లు తెలిపారు. బస్సుయాత్ర, బహిరంగ సభలు, నియోజకవర్గస్థాయి సభలు నిర్వహణపై చర్చించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు.
మరో మూడు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే ఎన్నికల ప్రచారంపై పూర్తి సమాచారం ఇస్తామని తెలిపారు. మరోవైపు పోరాడి తెచ్చుకున్న తెలంగాణ కోసం కవులు, కళాకారులు, గద్దర్ లాంటి వారు కలిసిరావాలని భట్టి విక్రమార్క కోరారు. తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కోసం ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.
ఏ ఆశయాలు, లక్ష్యాల కోసం రాష్ట్రాన్ని సాధించుకున్నామో వాటిని నెరవేర్చేందుకు ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. గద్దర్ రచించిన నడుస్తున్న పొద్దుమీద కదులుతున్న కాలమా.. పోరు తెలంగాణమా అన్న పాట లక్ష్యాన్ని చేరుకుందామన్నారు.
