Asianet News TeluguAsianet News Telugu

చార్మినార్ ఫోటోలు తీసిన ఓ టూరిస్ట్ పై పోలీస్ కేసు...

హైదరాబాద్ నగరానికి మద్యలో టీవీగా నిల్చున్న చార్మినార్ ని చూస్తే ఎవరికైనా దాని పక్కన నిల్చుని పోటోలకు పోజివ్వాలని అనిపిస్తుంది. ఆ కట్టడం అందాలను కెమెరాలో బంధిచాలని చూస్తుంటారు. అయితే ఇలాగే ఆలోచించిన ఓ యువతి కొత్త పద్దతిలో ఫోటోలు తీయడానికి ప్రయత్నించి చిక్కుల్లో పడింది. ఇలా చార్మినార్ పరిసరాలను పోటోలు తీసిన  టూరిస్ట్ ను పోలీసులు అదుపులో తీసుకున్నారు.

Tourist from West Bengal arrested for flying a drone near Charminar

హైదరాబాద్ నగరానికి మద్యలో టీవీగా నిల్చున్న చార్మినార్ ని చూస్తే ఎవరికైనా దాని పక్కన నిల్చుని పోటోలకు పోజివ్వాలని అనిపిస్తుంది. ఆ కట్టడం అందాలను కెమెరాలో బంధిచాలని చూస్తుంటారు. అయితే ఇలాగే ఆలోచించిన ఓ యువతి కొత్త పద్దతిలో ఫోటోలు తీయడానికి ప్రయత్నించి చిక్కుల్లో పడింది. ఇలా చార్మినార్ పరిసరాలను పోటోలు తీసిన  టూరిస్ట్ ను పోలీసులు అదుపులో తీసుకున్నారు.

పశ్చిమ బెంగాల్ కు చెందిన సువర్ణనాథ్(26) అనే యువతి ప్రొఫెషనల్ పోటో గ్రాఫర్. ఈమె హైదరాబాద్ ను సందర్శించి ఇక్కడి అందాలను చిత్రీకరించడానికి వచ్చింది. ఇందులో భాగంగా హైదరాబాద్ ఐకానిక్ కట్టడంగా పేర్కొనే పాతనగరంలోని చార్మినార్ ను చూడడానికి వెళ్లింది. అయితే అక్కడ ఆమె తన డ్రోన్ కెమెరాతో చార్మినార్ తో పాటు పరిసర ప్రాంతాలను చిత్రీకరించడం ప్రారంభించింది. దీన్న గమనించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

నగరంలో చారిత్రక కట్టడాలు, రద్దీ ప్రదేశాల్లో డ్రోన్ కెమెరాల వినియోగంపై నిషేదం ఉన్న సంగతి తెలిసిందే. పోలీసుల అనుమతి తప్పనిసరి. ఎలాంటి అనుమతి లేకుండా ఈమె చిత్రీకరణ చేపట్టడంతో స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందురాలిని న్యాయమూర్తి ఎదుట ప్రవేవపెట్టగా మొదటి తప్పుగా భావించి వెయ్యి రూపాయలు జరిమానా విధించి వదిలేశారని పోలీసులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios