ఓపెన్ ఇంటర్ పరీక్షలో గందరగోళం నెలకొంది. ఈ రోజు ఓపెన్ ఇంటర్ ఎకనామిక్స్ పరీక్ష జరగాల్సి ఉండగా.. తెలుగు మీడియం ప్రశ్నపత్రాలకు బదులు ఇంగ్లీష్ మీడియం ప్రశ్నపత్రాలను పరీక్ష కేంద్రాలకు పంపించారు.
ఓపెన్ ఇంటర్ పరీక్షలో గందరగోళం నెలకొంది. ఈ రోజు ఓపెన్ ఇంటర్ ఎకనామిక్స్ పరీక్ష జరగాల్సి ఉండగా.. తెలుగు మీడియం ప్రశ్నపత్రాలకు బదులు ఇంగ్లీష్ మీడియం ప్రశ్నపత్రాలను పరీక్ష కేంద్రాలకు పంపించారు. దీంతో అభ్యర్థులు ప్రశ్నపత్రాలను చూసి ఆశ్చర్యపోయారు. పరీక్ష కేంద్రాల్లో చివరి నిమిషంలో ఇన్విజిలేటర్లు ఈ విషయాన్ని గుర్తించారు. వెంటనే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ(టాస్).. నేటి ఓపెన్ ఇంటర్ ఎకనామిక్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు. రద్దైన పరీక్షను ఈ నెల 13న నిర్వహించనున్నట్టుగా తెలిపింది.
ఇక, కొన్ని కేంద్రాలలో పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థులను రెండు గంటలకు పైగా హాల్లో కూర్చొబెట్టారు. చివరకు పరీక్ష రద్దైందని ప్రకటించారు. అయితే ఈ ఘటనపై ఓపెన్ ఇంటర్ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరీక్ష కేంద్రాలకు పంపించే ముందు ప్రశ్నపత్రాలు సరైనవో? లేవో కూడా చెక్ చేసుకోరా? అని ప్రశ్నిస్తున్నారు. టాస్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని ఆరోపించారు.
