Today Top Story: ఆర్ధిక పరిస్ధితిపై శ్వేతపత్రం.. పల్లవి ప్రశాంత్ కు 14 రోజుల రిమాండ్.. షామికి అరుదైన గౌరవం

Today Top 10 Telugu Lastest News: శుభోదయం..ఈ రోజు టాప్ 10 సోర్టీలో తెలంగాణలో పెరుగుతోన్న కరోనా కేసులు.. ప్రమత్తమైన రాష్ట్రప్రభుత్వం, తెలంగాణ అసెంబ్లీలో వాడీవేడీ.. ఆర్ధిక పరిస్ధితిపై శ్వేతపత్రం విడుదల. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్టు.. 14 రోజుల రిమాండ్ వంటి పలు వార్తల సమాహారం.  

top 10 news stories for December 21, 2023 headlines andhra pradesh, Telangana updates krj

Today Top 10 Telugu Lastest News:

తెలంగాణలో పెరుగుతోన్న కరోనా కేసులు.. 

తెలంగాణలోనూ కరోనా కేసులు రోజురోజుకు  పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా  ఆరు కరోనా కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ కరోనా బులిటెన్‌ వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 14 మంది కరోనా బారినపడి చికిత్స పొందుతున్నట్టు సమాచారం.  ఇప్పటి వరకు 14 మంది పేషెంట్లు ఐసోలేషన్‌లో ఉన్నారు. వీళ్లంతా మైల్డ్ సింప్టమ్స్‌తోనే ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు.ఈ కేసులన్నీ హైదరాబాద్ నగర పరిధిలోనే నమోదు కావడం ఆందోళనకరం. 

ఆర్ధిక పరిస్ధితిపై శ్వేతపత్రం

తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై  రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క  బుధవారంనాడు శ్వేత పత్రం విడుదల చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో  42 పేజీల శ్వేతపత్రం విడుదల చేశారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై  స్వల్పకాలిక చర్చను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు.

శ్వేతపత్రంలోని ప్రధానాంశాలు..రాష్ట్రం మొత్తం అప్పులు రూ. 6,71,757 కోట్లు ఉన్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.  2014-15 నాటికి రాష్ట్రం రూ. 72,658 కోట్లుగా ఉందని తెలిపింది.  2014-22 మధ్య సగటున 24.5 శాతం అప్పులు పెరిగినట్టుగా ప్రభుత్వం వివరించింది. 2023-24 అంచనాల ప్రకారం రాష్ట్ర రుణం రూ. 3,89,673 కోట్లుందని పెరిగింది. 2015-16 లో రుణ, జీఎస్‌డీపీ 15.7 శాతంతో దేశంలోనే అత్యల్పంగా ఉందని  ప్రభుత్వం తెలిపింది.

2014-23 మధ్య బడ్జెట్ కేటాయింపుల్లో వాస్తవ వ్యయం  82.3 శాతమే ఉందని ప్రభుత్వం పేర్కొంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 రెట్లు రుణ భారం పెరిగిందని  ప్రభుత్వం తెలిపింది. రెవిన్యూ రాబడిలో  34 శాతానికి రుణ చెల్లింపుల భారం పెరిగిందని  ప్రభుత్వం వివరించింది.రెవిన్యూ రాబడిలో ఉద్యోగుల జీతాలకు 35 శాతం వ్యయం  పెరిగిందని  తెలిపింది. 2014లో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ 2022 నాటికి అప్పుల రాష్ట్రంగా మారిందని ప్రభుత్వం తెలిపింది.బడ్జెటేతర రుణాలు పేరుకుపోయి అప్పుల ఊబిలో తెలంగాణ కూరుకుపోయిందని ప్రభుత్వం వివరించింది.  ఆర్ధిక సవాళ్లను బాధ్యతాయుతంగా అధిగమిస్తామని  ప్రభుత్వం తెలిపింది.

బిగ్ బ్రేకింగ్.. పల్లవి ప్రశాంత్ కు 14 రోజుల రిమాండ్..

Pallavi Prashanth: బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్ విజేత పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సిద్ధిపేట గజ్వేల్‌ మండలం కొల్లూరులోని అతని నివాసం నుంచి ప్రశాంత్‌ను అరెస్ట్ చేశారు. అన్నపూర్ణ స్డూడియో దగ్గర గొడవ నేపథ్యంలో అతనిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. ఆయనను పోలీస్ స్టేషన్ కు తరలించకుండా మెజిస్టేట్ ముందు హాజరు పరిచారు. ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ కు 14 రోజుల రిమాండ్ విధించింది.

ఇది ముగింపు కాదు.. ఆరంభం : నారా లోకేశ్

Nara Lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన  యువగళం పాదయాత్ర ముగిసింది. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలిపల్లిలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో నారా లోకేష్‌ మాట్లాడుతూ..పాదయాత్ర అన్ని వర్గాల ప్రజల మధ్య విజయవంతంగా కొనసాగిందని అన్నారు. మూడు నెలల్లో ప్రజాస్వామ్యం సత్తా ఏంటో ప్రజలు జగన్‌కి చూపిస్తారని నారా లోకేశ్ పిలుపునిచ్చారు. యువగళం ముగింపు సభ కాదు, ఆరంభ సభ అని పేర్కొన్నారు. తాడేపల్లి తలుపు బద్దలు కొట్టేవరకు ఈ ప్రజాస్వామ్య యుద్ధం ఆగదని లోకేశ్ స్పష్టం చేశారు. ఇప్పుడు రాష్ట్రానికి విజనరీ నాయకుడు చంద్రబాబు, పవర్‌పుల్‌ నాయకుడు పవన్‌ కల్యాణ్‌ కావాలన్నారు. పాదయాత్ర చేస్తే పోరాటం అవుతుందని,  త్వరలో రాష్ట్రంలో రాక్షస పాలన అంతమవుతుందని అన్నారు. యువగళం, మనగళం, ప్రజాగళం అన్న లోకేశ్, బాంబులకే భయపడమని పిల్ల సైకోలకు భయపడతామా అంటూ వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

షమీతో సహా 26 మందికి అర్జున్ అవార్డు 

National Sports Award 2023: కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ బుధవారం క్రీడా పురస్కారాలను ప్రకటించింది. భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ సహా 26 మంది ఆటగాళ్లను అర్జున అవార్డులను అందించనున్నది. అదే సమయంలో దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుకు భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ జోడీ రంకిరెడ్డి సాత్విక్‌ సాయిరాజ్‌- చిరాగ్‌ శెట్టి ఎంపికయ్యారు. జనవరి 9న దిల్లీలో క్రీడాకారులందరినీ సన్మానించి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము క్రీడాకారులకు పురస్కారాలు అందజేస్తారు. క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకారం.. 26 మంది అథ్లెట్లను అర్జున అవార్డుతో సత్కరించనున్నారు. సత్కరించే క్రీడాకారులను ఆ సంవత్సరం వారి ప్రదర్శన ఆధారంగా ఎంపిక చేస్తారు. క్రీడా శాఖ అతని పేరును సిఫారసు చేస్తుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios