కేసిఆర్ పై ఓయు స్టూడెంట్స్ ఇలా కసి తీర్చుకున్నారు

First Published 13, Dec 2017, 2:31 PM IST
tomatoes thrown at kcr portrait on Osmania campus
Highlights
  • కసి తీర్చుకున్న ఉస్మానియా స్టూడెంట్స్
  • పాలాభిషేకం చేసిన చోటే టమాటాల వర్షం
  • తెలంగాణ ద్రోహి ఎవరు అంటూ పోస్టర్ 

తెలంగాణ ఉద్యమ నేత, సిఎం కేసిఆర్ పై ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు ఆగ్రహంగా ఉన్నారు. ఎప్పటినుంచో వారు ఆగ్రహంగా ఉన్నారు. తెలంగాణ రాకముందు నుంచే వారిలో కేసిఆర్ పట్ల కోపం ఉంది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆ కోపం అట్లనే కొనసాగింది. తెలంగాణ వచ్చీ రాగానే ఉస్మానియా విద్యార్థులపై కేసిఆర్ చేసిన కామెంట్స్ వారిలో కోపాన్ని పెంచాయి. ఉస్మానియా భూములను తీసుకుని పేదలకు డబుల్ బెడ్రూమూలు ఇండ్లు కట్టిస్తానని సిఎం కేసిఆర్ ప్రకటించారు. ఈ ప్రకటన కూడా ఉస్మానియా విద్యార్థుల ఆగ్రహానికి కారణాల్లో ఒకటి.

తెలంగాణ వచ్చిన తొలినాళ్లలో ఉస్మానియా యూనివర్శిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదుట సిఎం కేసిఆర్ కు పాలాభిషేకాలు జరిగేవి. సచివాలయంలో కేసిఆర్ ప్రకటన వెలువరించడం.. వెనువెంటనే టిఆర్ఎస్ అనుబంధ విద్యార్థి సంఘం నేతలు రంగంలోకి దిగి ఆర్ట్స్ కాలేజీ ముందు కేసిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం ఎన్నోసార్లు జరిగింది కూడా. కానీ రాను రాను పాలాభిషేకాలు తగ్గిపోయాయి. ఈమధ్య కాలంలో మొత్తమే బంద్ అయినయి.

అయితే ఇప్పుడు ఉస్మానియాలో యాంటీ కేసిఆర్ మూమెంట్ ఊపందుకున్నది. కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు జరిగిన ఆర్ట్స్ కాలేజీ వేదికగా ఇప్పుడు కేసిఆర్ చిత్రపటాన్ని టమాటాలతో కొట్టి నిరసన తెలుపుతున్నారు. అంతేకాదు కేసిఆర్ తెలంగాణ ద్రోహి అంటూ పోస్టర్ రాసి ఆ పోస్టర్ లో కేసిఆర్ బొమ్మ పెట్టి మరీ టమాటాలతో కొడుతూ నిరసన తెలిపారరు. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో సర్కులేట్ చేస్తున్నారు. తిరగబడ్డ ఉస్మానియా అంటూ నినదిస్తున్నారు. తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

loader