Asianet News TeluguAsianet News Telugu

Tomatoes, chicken prices: రికార్డులు సృష్టిస్తున్న చికెన్‌, ట‌మాటా ధ‌ర‌లు !

Tomatoes, chicken prices: తెలంగాణ‌లో ట‌మ‌టా , చికెన్ ధ‌ర‌లు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. దీంతో చికెన్ తినెట్టులేదు.. ట‌మాటలతో వంట చేసుకునెట్టు లేద‌ని సామాన్య ప్ర‌జ‌లు వాపోతున్నారు. 
 

Tomatoes chicken prices touch all time high in Telangana
Author
Hyderabad, First Published May 18, 2022, 11:02 AM IST

Telangana: దేశవ్యాప్తంగా ప్ర‌స్తుతం నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు రికార్డుల మోత మోగిస్తున్నాయి. స‌మాన్యుల‌పై ఆర్థిక భారం మ‌రింత‌గా మోపుతున్నాయి. ఇప్ప‌టికే ఎల్పీజీ సిలిండ‌ర్ గ్యాస్ ధ‌ర‌లు, వంట నూనెల ధ‌ర‌ల పెరుగుద‌ల వంటింటిపై తీవ్ర ప్ర‌భావం చూపుతోంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం ట‌మాటా ధ‌ర‌లు ఆకాశ‌మే హ‌ద్దుగా పెరిగిపోతున్నాయి. అలాగే, చికెన్ ధ‌ర‌లు సైతం రెక్క‌లొచ్చిన ప‌క్షిలా పైపైకి ఎగిరిపోతున్నాయి. దీంతో స‌మాన్య ప్ర‌జానీకం ఏం కొనేట్టు లేదు.. ఏం తినెట్టు లేద‌ని చెబుతున్నారు. 

ప్ర‌స్తుతం తెలంగాణ‌లో చికెన్‌, ట‌మాటా ధ‌ర‌లు గ‌రిష్ట స్థాయికి చేరుకున్నాయి. తెలంగాణలో టమోటాలు, బ్రాయిలర్ చికెన్ ధరలు భారీగా పెరిగాయి. టమాటాను రిటైల్ మార్కెట్ లో కిలోకు రూ. 80 నుంచి 90 విక్ర‌యిస్తున్నాయి. ఇక చికెన్ ధ‌ర‌లు కిలోకు రూ. 310 నుండి 320 రూపాయలకు చేరుకుంది. ధ‌ర‌లు మ‌రింత‌గా పెరిగే అవ‌కాశ‌ముంద‌ని నిపుణులు, విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. ట‌మాటా ధ‌ర‌లు చాలా కాలం త‌ర్వాత ఈ స్థాయిలో పెరుగుతున్నాయ‌ని మార్కెట్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. వేసవి కాలం కావడంతో తెలంగాణలో టమాట సాగు తగ్గింది. ఇంతకుముందు హోల్‌సేల్ మార్కెట్‌కు 2.25 లక్షల కిలోల టమోటాలు కలిపి దాదాపు 9000 పెట్టెలు వచ్చేవి. ఈ పరిమాణం ఇప్పుడు కేవలం 3,000 పెట్టెలు మాత్ర‌మే మార్కెట్ కు వ‌స్తున్నాయి. దీంతో డిమాండ్‌.. స‌ర‌ఫ‌రా లోటు నేప‌థ్యంలో ధ‌ర‌లు గ‌ణ‌నీయంగా పెరుగుతున్నాయి.

 ట‌మాటా ధ‌ర‌లు సాధార‌ణంగా కిలో రూ.15 నుంచి 20 వరకు విక్ర‌యిస్తుంటారు. అయితే, ప్ర‌తికూర‌లో వినియోగించే ట‌మాటా ధ‌ర‌లు ప్రస్తుతం సాగు త‌క్కువ‌గా ఉండ‌టం.. ఉన్న పంట‌కూడా ఎండ‌ల‌కు దిబ్బ‌తిన‌డంతో దిగుబ‌డి త‌గ్గింది. దీంతో ట‌మాటా ధ‌ర‌ల‌కు రెక్క‌లొచ్చాయి. నిజామాబాద్ అంకాపూర్ నుంచి 30 శాతం మాత్రమే టమోటాలు వస్తున్నాంటే ప్ర‌స్తుతం ట‌మాటా దిగుబ‌డి ఎంత త‌క్కువ‌గా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇటీవ‌ల ఉరుములు, మెరుపుత‌లో కూడిన వ‌ర్షాలు ప‌డ్డాయి. ప‌లు చోట్ల వ‌డ‌గండ్ల వాన‌కూడా ప‌డింది. ఎండ‌ల కార‌ణంగా చాలా వ‌ర‌కు పంట దెబ్బ‌తిన‌గా.. అకాల‌వ‌ర్షంతో మ‌రింత‌గా పంట‌పై ప్ర‌భావం ప‌డింది. దీంతో సాగు త‌క్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో ఎండ‌లు, అకాల‌వ‌ర్షాల‌తో దిగుబ‌డి సైతం త‌గ్గింది. 

ఇక చికెన్ ధరల విషయానికొస్తే చికెన్ ధ‌ర‌లు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాఇ. ఇదివ‌ర‌కు అంటే..  ఐదు నెలల క్రితం చికెన్ కిలోకు రూ.80, బ‌న్‌లెస్ చికెన్ రూ.125కు ల‌భించేది. అయితే, ప్ర‌స్తుతం కిలో చికెన్ ధ‌ర 300 రూపాయ‌లు దాటింది. న్‌లెస్ చికెన్‌కి కిలోకు 500 రూపాయల వ‌ర‌కు ఉంటోంది. దీంతో ఇప్పుడు చికెన్ సామాన్యులకు అంద‌ని ద్రాక్ష‌లా మారింది. వేసవిలో, సాధారణంగా బ్రాయిలర్ చికెన్ ధరలు విపరీతంగా పెరుగుతాయి.. ఎందుకంటే ఎండ‌ల ప్రభావం కార‌ణంగా కోళ్లు చ‌నిపోవ‌డం.. దిగుబ‌డి త‌గ్గ‌డం వంటి ప‌రిస్థితులు ఉంటాయి. అయితే, ఈ సంవత్సరం సాధారణం కంటే ఎక్కువ‌గా చికెన్ ధ‌ర‌లు పెరుగుతున్నాయి. దీనికి ఎండ‌ల ప్ర‌భావ కార‌ణం ఒక‌టికాగా, ప్ర‌స్తుతం కోళ్ల దాణా ఖర్చులు కూడా పెరగడంతోపాటు డిమాండ్ బలంగా ఉండడంతో చికెన్ ధరలు పెరుగుతున్నాయి. పౌల్ట్రీ ఫీడ్ ధరల పెరుగుదల ఉత్పత్తి ఖర్చులు పెరగడానికి దారితీసింది.. దీని ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా చికెన్ ధరలు గ‌ణ‌నీయంగా పెరిగాయి.

Follow Us:
Download App:
  • android
  • ios