Asianet News TeluguAsianet News Telugu

టమాటా కిలో రూ. 2... భారీగా పడిపోయిన ధరలు..!!

టమాటా ధరలు రైతుల కంట కన్నీరు పెట్టిస్తున్నాయి. ఒక్కసారిగా రేట్లు భారీగా పడిపోవడంతో పెట్టుబడి కూడా దక్కక రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయారు. చాలా రోజులుగా పది రూపాయలు కిలో ఉన్న టమాటా ఒక్కసారిగా రెండు రూపాయలకు పడిపోయింది. 

tomato prices fall to 3 years low per kg in wholesale markets - bsb
Author
Hyderabad, First Published Jan 18, 2021, 11:24 AM IST

టమాటా ధరలు రైతుల కంట కన్నీరు పెట్టిస్తున్నాయి. ఒక్కసారిగా రేట్లు భారీగా పడిపోవడంతో పెట్టుబడి కూడా దక్కక రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయారు. చాలా రోజులుగా పది రూపాయలు కిలో ఉన్న టమాటా ఒక్కసారిగా రెండు రూపాయలకు పడిపోయింది. 

ఆదివారం అంటే జ‌న‌వ‌రి 17న కేవ‌లం రూ.2 ప‌లికింది. దీంతో ట‌మాట పండించే రైతులు దారుణంగా నష్టపోతున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర కాదు కదా నామమాత్రపు ధర కూడా దక్కడంలేదు.

ఉద్యానశాఖ లెక్క ప్ర‌కారం క్వింటా టమాటకు రూ.900 దక్కితే రైతుకు గిట్టుబాటవుతుంది. కాగా.. ఇటీవ‌ల క్వింటాల్ ధ‌ర రూ.100 నుంచి రూ.250 మాత్రమే ప‌లికింది. అయితే వినియోగదారులకు మాత్రం టోకు, చిల్లర వ్యాపారులు కలిసి కిలో టమాటను రూ.10 నుంచి రూ.15కు అమ్ముతుండటం గమనార్హం. 

కాగా గ‌తంలో కిలో ట‌మాట ధ‌ర రూ.40 నుంచి రూ.60 వ‌ర‌కు ప‌లికింది. అప్ప‌డూ రైతుకు ద‌క్కింది క్వింటాకు రూ.400 నుంచి రూ.600లోపే. అయితే పెట్టుబడి ఏ మాత్రం దగ్గడం లేదు. క్వింటా టమాట పంట పండించడానికి రైతు సగటున రూ.600 దాకా పెట్టుబడి పెట్టాల్సి వస్తోందని ఉద్యానశాఖ అధ్యయనంలో తేలింది. 

పంట కోత, రవాణా, ఇతర ఖర్చులు మరో రూ.300 వరకూ అవుతాయి. ఈ క్రమంలో క్వింటాకు కనీసం రూ.900 చెల్లిస్తేనే రైతుకు గిట్టుబాటు అవుతుందని అధికారులు తెలుపుతున్నారు. పంట దిగుబ‌డి పెర‌గ‌డంతో ధ‌ర‌లు ప‌డిపోతున్నాయ‌ని వ్య‌వసాయ‌, ఉద్యాన‌శాఖ అధికారులు తెలుపుతుండ‌గా… క‌నీస ధ‌ర లేక‌పోతే పంట పండించ‌డం ఎందుక‌ని అన్న‌దాత‌లు ఆక్రోశిస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios