రామగుండం: బాహుబలి, సాహో లాంటి పాన్ ఇండియా మూవీలతో హీరో ప్రభాస్ టాలీవుడ్ స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ప్రస్తుతం కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో మరో పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ రామగుండంలోని బొగ్గు గనుల్లో జరుగుతోంది.  

ఇలా సలార్ మూవీ షూటింగ్ కోసం రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చేరుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆదివారం గోదావరిఖని ప్రాంత అభిమానులతో చిట్‌చాట్ చేశారు. ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో గత వారం రోజులుగా సలార్ మూవీ చిత్రీకరణలో పాల్గొంటున్న ప్రభాస్.. ఇవాళ పారిశ్రామిక ప్రాంత అభిమానులు, సింగరేణి ముఖ్య అధికారులు, లోకల్ లీడర్స్‌తో సంభాషించారు.

 read more నిజమా? ‘సలార్‌’ కి నక్సల్స్ భయం? భారీ భద్రత

గోదావరిఖనిలోని ఇల్లందు గెస్ట్ హౌస్‌లో బస చేస్తున్న ప్రభాస్.. అభిమానులను కలిసేందుకు ఓకే అనడంతో రామగుండం సీపీ సత్యనారాయణ ఆదేశాల మేరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో యంగ్ రెబర్ స్టార్‌ను చూసేందుకు భారీగా అభిమానులు చేరుకోవడంతో వారిని కంట్రోల్ చేసేందుకు పోలీసులు ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది.