హైదరాబాద్ శిల్పకళావేదికలో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు.

ఆయనతో పాటు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ ఎంపీ సుజనా చౌదరి, హీరోలు వెంకటేశ్, మహేశ్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతి కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి.

Also Read:మహేష్ బాబుకి జగన్ ఆఫర్..!

ముప్పవరపు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. సంక్రాంతి వేడుకల్లో భాగంగా రంగు రంగుల రంగవల్లులు, హరిదాసులు, జంగందేవరలు, బుడబుక్కల వారు, గంగిరెద్దుల విన్యాసాలు సందర్శకులను అలరిస్తున్నాయి. 

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం'సరిలేరు నీకెవ్వరు; ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి కానుకగా ఈ నెల 11న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మహేష్ అభిమానులకు ఏపీ ప్రభుత్వం అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది.

ఈ సినిమా ప్రత్యేకషోలు వేసుకోవడానికి అనుమతినిచ్చింది. అదనపు షోల కోసం చిత్రనిర్మాత అనీల్ సుంకర ఏపీ ప్రభుత్వాన్ని అనుమతి కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి లెటర్ రాశారు. ఈ లేఖని పరిశీలించిన జగన్ ప్రభుత్వం స్పెషల్ షోలు వేసుకోవడానికి అంగీకరించింది.

Also Read:కేసీఆర్ వచ్చినా రాని మంత్రులు: క్లాస్ తీసుకొన్న గులాబీ బాస్

ఈ నెల 11 నుంచి 17వ తేదీ వరకు వారం రోజుల పాటు ప్రతి రోజు అదనంగా రెండు షోలు వేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. ఈ క్రమంలో థియేటర్ యజమానులు..  తెల్లవారుజామున గం.1 నుంచి గం.10ల మధ్యలో రెండు షోలను ప్రదర్శించడానికి ప్లాన్ చేస్తున్నారు. అంటే రోజుకి ఆరు షోలు వేస్తారు.

ఇది సూపర్ స్టార్ అభిమానులకు సంతోషం కలిగించే విషయం. ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. విజయశాంతి, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, సంగీత, బండ్ల గణేష్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. అనిల్ సుంకర, మహేష్ బాబు, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు.