Today Top Stories:గ్రూప్ 2 పరీక్ష మరోసారి వాయిదా..సింగరేణి ఫలితాల్లో ఐఎన్‌టీయూసీ హవా..

Today Top Stories: శుభోదయం..ఈ రోజు టాప్ సోర్టీస్ లో భారత్, ఇటలీ మధ్య చారిత్రక ఒప్పందం.. విద్యార్థులకు వరం..సింగరేణి ఫలితాల్లో ఐఎన్‌టీయూసీ హవా.. గ్రూప్ 2 పరీక్ష మరోసారి వాయిదా.. ర్యాష్ డ్రైవింగ్ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడిపై లుకౌట్ నోటీసులు.. భారత్ లో కోవిడ్ కొత్త వేరియంట్ విజృంభన. రెండో రోజు ఆటలో భారత్ పై దక్షిణాప్రికా స్వల్ప అధిపత్యం వంటి పలు వార్తల సమాహారం.   

today top Stories top 10 telugu news for december 28 2023 headlines andhra pradesh telangana updates krj

Today Top Stories: గ్రూప్ 2 పరీక్ష మరోసారి వాయిదా..

TSPSC Group-2 Exam: తెలంగాణ విద్యార్థులకు మరోసారి నిరాశ. టీఎస్‌పీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్‌-2 పరీక్ష మరోసారి వాయిదా పడింది. వాస్తవానికి షెడ్యూల్‌ ప్రకారం జనవరి 6,7వ తేదీల్లో పరీక్ష నిర్వహించాలి. అయితే.. ఇటీవల టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌తో పాటు మరో ముగ్గురు సభ్యులు రాజీనామా చేయడంతో ఈ పరీక్ష నిర్వహణ కష్టంగా మారింది. ఈ క్రమంలో గ్రూప్‌-2 పరీక్షను మరోసారి వాయిదా వేస్తూ టీఎస్‌పీఎస్సీ ప్రకటన చేసింది. కొత్త తేదీలను త్వరలో వెల్లడిస్తామని ప్రకటించింది. ఈ మేరకు గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.


బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడిపై లుకౌట్ నోటీసులు

బీఆర్ఎస్ సీనియర్ నేత, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్‌పై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ర్యాష్ డ్రైవింగ్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు , పరారీలో వున్న సాహిల్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నెల 23వ తేదీ అర్ధరాత్రి హైదరాబాద్ ప్రజాభవన్ వద్ద వున్న బారికేడ్లను షకీల్ కుమారుడు కారుతో ఢీకొట్టాడు. మద్యం మత్తులో వున్న సాహిల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కారు అతనిదేనని, నడిపింది కూడా అతనేనని తేల్చారు. బ్రీత్ ఎనలైజ్ టెస్ట్ కోసం పంజాగుట్ట స్టేషన్‌కు తరలిస్తుండగా సాహిల్ పారిపోయాడని ప్రచారం జరిగింది. అయితే కేసును కొందరు పోలీసులు తప్పుదోవ పట్టించినట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయి. 

సింగరేణి ఎన్నికల్లో ఐఎన్‌టీయూసీ హవా.. 
 
Singareni Elections : ఏడాదిన్నర కాలంగా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సింగరేణి (SCCL) ఎన్నికలు ముగిశాయి. కేంద్ర కార్మికశాఖ ఆధ్వర్యంలో  ఆరు జిల్లాల్లోని 11 డివిజన్లలో ఏర్పాటు చేసిన 84 పోలింగ్‌ కేంద్రాలలో ఎన్నికలు నిర్వహించారు. 94.15 పోలింగ్‌ శాతం నమోదైంది.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మొత్తం 39,773 మంది ఓటర్లలో 37,447 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న ఐఎన్‌టీయూసీ(AITUC) సత్తా చాటింది.  ఫలితాల్లో ఇల్లందు, కొత్తగూడెం కార్పొరేటు పరిధి, మణుగూరు, రామగుండం-3, ఏరియాల్లో ఐఎన్‌టీయూసీ (AITUC) విజయం సాధించింది. ఇక బెల్లంపల్లి, రామగుండం-1, రామగుండం-2 ఏరియాల్లో ఏఐటీయూసీ విజయం సాధించింది.
 

నోడల్ అధికారులు ఎవరంటే..?

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న ప్రజా పాలన కార్యక్రమానికి నోడల్ అధికారులను నియమించింది. ఉమ్మడి జిల్లాల వారీగా ఐఏఎస్ అధికారులను నోడల్ అధికారులుగా నియమిస్తూ సీఎస్ శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

నోడల్ అధికారులు వీరే :

ఆదిలాబాద్‌- ఎం. ప్రశాంత్‌
కరీంనగర్ – శ్రీదేవసేన
నిజామాబాద్‌- క్రిస్టినా చోంగ్తూ
వరంగల్‌ – వాకాటి కరుణ
మెదక్‌ – ఎస్‌. సంగీత
హైదరాబాద్‌ – కె.నిర్మల
రంగారెడ్డి – ఇ.శ్రీధర్‌
మహబూబ్‌నగర్‌ – టి.కె.శ్రీదేవి
నల్గొండ – ఆర్వీ కర్ణన్‌
ఖమ్మం – ఎం.రఘునందన్‌రావు


భారత్ లో కోవిడ్ కొత్త వేరియంట్ విజృంభన 

 భారత్ లో కోవిడ్ -19 కొత్త వేరియంట్ పంజా విసురుతోంది. ఈ కొత్త జేఎన్.1 వేరియంట్ వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో మరో నలభై కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కొత్త వేరియంట్ కేసుల సంఖ్య 109 కు పెరిగిందని అధికారిక వర్గాలు బుధవారం తెలిపాయి. గుజరాత్ లో 36, కర్ణాటక లో 34, గోవాలో 14, మహారాష్ట్రలో 9, కేరళ లో 6, రాజస్థాన్, తమిళనాడు ల్లో 4 చొప్పున, తెలంగాణలో 2 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం చాలా మంది రోగులు హోం ఐసోలేషన్లో ఉన్నారని అధికారులు తెలిపారు. కొత్త వేరియంట్ ను నిశితంగా పరిశీలిస్తున్నామని నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వికె పాల్ గత వారం చెప్పారు, అయితే రాష్ట్రాలు పరీక్షలను పెంచాల్సిన అవసరం ఉందని, వారి నిఘా వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. దేశంలో కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, జేఎన్.1 సబ్ వేరియంట్ ను గుర్తించినప్పటికీ, వైరస్ సోకిన వారిలో 92 శాతం మంది ఇంటి ఆధారిత చికిత్సను ఎంచుకుంటున్నారని, ఇది స్వల్ప అనారోగ్యాన్ని సూచిస్తుందని అధికారులు తెలిపారు. ఆసుపత్రిలో చేరే రేటులో కూడా పెరుగుదల లేదని, ఇతర వైద్య పరిస్థితుల కారణంగా హాస్పిటల్స్ లో చేరిన వారిలో కోవిడ్ -19 యాదృచ్ఛికంగా కనుగొనబడిందని వారు తెలిపారు.


భారత్, ఇటలీ మధ్య చారిత్రక ఒప్పందం.. 

India – Italy: భారత్, ఇటలీ మధ్య చారిత్రక ఒప్పందం కుదిరింది. ఇటలీ ప్రభుత్వం భారతీయ విద్యార్థులకు విద్యాభ్యాసం తర్వాత 12 నెలలు అదనంగా ఉండేందుకు అనుమతించింది. ప్రధాని మోడీ ప్రతిపాదనలకు ఇటలీలోని మెలోని ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయం భారతీయ విద్యార్థులకు ఎంతో మేలు చేకురనున్నది. అదే సమయంలో భారతీయ కార్మికుల కోసం ప్రత్యేకంగా రిజర్వ్ కోటాను కూడా రిజర్వ్ చేసింది. అలాగే.. స్కెంజెన్ వీసా పొందడానికి వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి ఇటలీ సర్కార్ సహకరిస్తోంది. 


భారత్ పై దక్షిణాఫ్రికా స్వల్ప అధిపత్యం 

IND vs SA: భారత్-దక్షిణాఫ్రికా మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్ సెంచూరియన్‌లో జరుగుతోంది. రెండో రోజు ఆట ముగిసింది. దక్షిణాఫ్రికా స్కోరు 256/5. ఆఫ్రికన్ జట్టు భారత్ స్కోరు కంటే 11 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఐదు వికెట్లు మిగిలి ఉన్నాయి. డీన్ ఎల్గర్ 140 పరుగులతో ఆడుతున్నాడు. దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత్ తొలి ఇన్నింగ్స్ 245 పరుగుల వద్ద ముగిసింది. ఇప్పుడు మూడో రోజు వీలైనంత త్వరగా దక్షిణాఫ్రికాను కట్టడి చేసి, తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించకుండా భారత్ అడ్డుకోవాలి. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 50 పరుగుల కంటే ఎక్కువ ఆధిక్యం సాధిస్తే, ఈ మ్యాచ్‌లో భారత్‌కు పునరాగమనం చేయడం కష్టం.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios