ఈసారి ఇంటగెలిచే రచ్చ గెలవాలని... పక్కా వ్యూహాలతో రంగంలోకి రేవంత్ రెడ్డి 

తెెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి మంచి దూకుడుమీదున్న కాంగ్రెస్ గెలుపుపై ధీమాతో వుంది. ఈ క్రమంలో ఇంటగెలిచి రచ్చ గెలవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. 

Today Revanth Reddy election campaign  in Kodangal AKP

కొడంగల్ : ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నది సామెత. ఇది రాజకీయాలకు సరిగ్గా సరిపోయే సామెత. ఎంతపెద్ద నాయకుడైనా, ఎంతమందిని గెలిపించుకునే సత్తా వున్నా సొంత నియోజకవర్గంలో గెలుపే ముఖ్యం. ఎప్పుడూ పోటీచేసే నియోజకవర్గంలో ఒకటి రెండుసార్లు ఓడిపోయారంటే ఆ నాయకుడి పని అయిపోయినట్లే అని భావిస్తుంటారు. అందుకోసమే కీలక నాయకులు ఎప్పుడూ ఒకే నియోజకవర్గంపై మంచి పట్టు సాధించి ప్రతిసారి అక్కడినుండే పోటీ చేస్తుంటారు. ఇలా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కొడంగల్ సొంత నియోజకవర్గంగా మారిపోయింది. 

గతంలో టిడిపి, ఇప్పుడు కాంగ్రెస్ నుండి కూడా రేవంత్ రెడ్డి కొడంగల్ నుండే పోటీచేస్తూ వస్తున్నారు. అయితే వరుసగా గెలుచుకుంటూ వస్తున్న రేవంత్ గత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. బిఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయిన రేవంత్ ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుండి పోటీచేసి గెలిచారు. ఇలా ఎమ్మెల్యే కావాలనుకున్న రేవంత్ అనుకోకుడా ఎంపీ అయ్యాడు. 

అయితే ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ కొడంగల్ నుండే రేవంత్ బరిలోకి దిగారు. ఓడిన చోటే తిరిగి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న పట్టుదలతో రేవంత్ వున్నట్లు అర్థమవుతుంది. దీంతో టిపిసిసి అధ్యక్షుడిగా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం పనిచేస్తున్న రేవంత్ సొంత నియోజకవర్గంపైనా దృష్టిపెట్టారు. గత ఎన్నికల్లో ఫలితం రిపీట్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు. 

Read More కేసీఆర్ పై కుట్రలు... ఈ 15 రోజులు ఏమైనా జరగొచ్చు : కేటీఆర్ సంచలనం

ఇప్పటికే కొడంగల్ లో నామినేషన్ దాఖలుచేసిన రేవంత్ నేడు ప్రచారంలో పాల్గొననున్నారు. నియోజకవర్గ పరిధిలోని దౌల్తాబాద్, మద్దూరు, గుండుమాల్, కోస్గి లలో జరిగే కాంగ్రెస్ కార్నర్ మీటింగ్స్ లో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ఇలా ఇవాళ మధ్యాహ్నం నుండి రాత్రి వరకు కొడంగల్ ప్రచారంలోనే రేవంత్ పాల్గొంటారు. 

రేవంత్ కొండగల్ ప్రచార వివరాలు : 

మధ్యాహ్నం 1గంటకు దౌల్తాబాద్ 

మధ్యాహ్నం 2.30 గంటలకు మద్దూరు

సాయంత్రం 5 గంటలకు గుండుమాల్

సాయంత్రం 6.30 గంటలకు కోస్గి లో రేవంత్ రెడ్డి ప్రచారం చేపట్టనున్నారు. 

కేవలం కొడంగల్ లోనే కాదు ముఖ్యమంత్రి కేసీఆర్ పై కామారెడ్డిలో పోటీ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. గతంలో ఓడిన కొడంగల్ లో, సీఎం కేసీఆర్ పై కామారెడ్డిలో గెలిచి సత్తా చాటాలని రేవంత్ భావిస్తున్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios