Asianet News TeluguAsianet News Telugu

నేడు తెలంగాణ భారీ నుండి అతిభారీ వర్షాలు... హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక

ఇవాళ (ఆదివారం) తెలంగాణ వ్యాప్తంగా భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు వున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 

today heavy rain in telangana
Author
Hyderabad, First Published Jun 26, 2022, 10:29 AM IST

హైదారాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ (ఆదివారం) వర్షాలు కురిసే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, సిరిసిల్ల, భూపాలపల్లి, కరీంనగర్, ములుగు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురవొచ్చని... మిగతా జిల్లాలో మోస్తరు వర్షాలు కురుసే అవకాశాలున్నాయి ప్రకటించారు. కాబట్టి ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించారు. 

రేపు(సోమవారం) కూడా రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ ప్రకటించింది. మంగళ, బుధ, గురువారాల్లో వాతావరణం చల్లబడి వుండటం... అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించడంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా వేసవి ఎండలతో వేడెక్కిన హైదరాబాద్ వర్షాలతో చల్లబడింది. గత అనుభవాల దృష్ట్యా భారీ వర్షాలు కురిసే సమయంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంసి హెచ్చరిస్తోంది. 

ఇప్పటికే గత వారం రోజులుగా హైదరాబాద్ లో వర్షాలు కురుస్తున్నాయి. వరద నీటి ఉదృతికి నాలాలు పొంగిపొర్లుతూ రోడ్లపైకి నీరు చేరుతోంది. చిన్నపాటి వర్షాలకే నగరంలో పలుచోట్ల రోడ్లపైనే మోకాళ్ల లోతు నీరు నిలుస్తోంది. దీంతో జిహెచ్ఎంసి డిఆర్ఎస్ బృందాలను అప్రమత్తం చేసింది.

ఇక ఈనెల 15న రాత్రి హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. 14న కూడా హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. ఈ నెల 17న ఉదయం నుండి వర్షం ప్రారంభమైంది. గంటకు పైగా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. నగరంలోని పాతబస్తీలోని ఛత్రినాక, శివ గంగ నగర్, శివాజీ నగర్ లో వరద నీరు రోడ్లపై పొంగి పొర్లింది.

దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మణికొండలో కూడా వర్షం నీరు రోడ్లపై చేరడంతోట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆ రోజు మేడ్చల్ జిల్లాలో అత్యధికంగా 9.1 సెంటీమీటర్ల వర్షం నమోదయింది. సింగపూర్ టౌన్షిప్ దగ్గర 5.6 సెం.మీ వర్షం నమోదయింది. రాష్ట్రానికి పశ్చిమ దిశ నుంచి కింది గాలులు బలంగా వీస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 

Follow Us:
Download App:
  • android
  • ios