గత రెండు రోజుల నుంచి తగ్గుతున్న బంగారం ధర ఈ రోజు స్వల్పంగా పెరిగింది.

బంగారం, వెండి ధరలు కొన్ని రోజులుగా పోటీపడి తగ్గుతున్నాయి. ఈ రోజు మాత్రం వాటి ధరల తగ్గింపునకు బ్రేక్ పడింది.

నిన్న పది గ్రాముల బంగారం ధర రూ.29,150 గా నమోదవగాఈ రోజు మళ్లీ ధర పుంజుకుంది.

ఈ రోజు జరిగిన ట్రేడింగ్‌లో పది గ్రాములకు రూ.230 పెరిగి రూ.29,380కి చేరుకుంది. కొనుగోళ్లు పెరగడం వల్లే ధర పరిగినట్టు బులియన్ వర్గాలు తెలిపాయి. వెండి కూడా కిలోకు రూ.850 పెరిగి రూ.41,800 కు చేరుకుంది.